కూల్చివేతలు ఆగినట్టేనా?

Jun 19, 2026 - 22:12
Jun 19, 2026 - 22:15
 0  1
కూల్చివేతలు ఆగినట్టేనా?

జోగులాంబ గద్వాల 19 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- పట్టణంలో అధికారులు చేపట్టిన కూల్చివేతలు ఆగినట్టేనా అనుకుంటున్నారు పట్టణ ప్రజలు. పెద్ద పెద్ద రోడ్లను ఇంకా పెద్దగా చేశారు బానే ఉంది కాని చిన్న చిన్న రోడ్లను, ఇరుకుగా వున్న రోడ్లను పెద్దగా చేయరా? అంటూ కాలనీవాసులు  గుసగుసలాడుకుంటున్నారు. అదీ కాక కృష్ణవేణి చౌరస్తాలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దుకాణ సముదాయల వద్ద మాత్రం ఒక్క మెట్టును కూడ కూల్చకపోవడానికి గల కారణాలు ఏందో అర్థం కావట్లేదు అంటూ ముచ్చటించుకున్నారు మున్సిపాలిటీ ప్రజలు. కొందరు దుకాణ యజమానులు కూల్చేయడం అయిపొయింది మన జోలికి రారులే ఇక అనుకుని దుకాణాల ముందు గతంలో ఉన్నట్టే కూల్చిన వద్దే మెట్లు కట్టుకుంటున్నారు.కాకపోతే ఎందుకోసం ఈ రెండు రోడ్లను మాత్రమే కూల్చారు, మిగతావి ఎందుకు కూల్చలేకపోతున్నారు, ఇవి కూల్చడానికి గల కారణాలు ఏంది?, కూల్చిన తర్వాత వెడల్పయినా రోడ్లను ఏమి చేస్తారు.... అనే అనుమానాలకు మాత్రం ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి పట్టణ ప్రజలది. *కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్టుగా కూలగొట్టడానికి కూడ అనేక కారణాలు ఉంటాయి. ముందస్తు ప్రణాళిక లేనిదే అనేక ఒత్తిళ్ళు వచ్చినా, ఇలాంటి చర్యలకు పూనుకున్నారంటే ఆ శ్రమ వెనకాల ఎంతో ఫలితం ఉండి ఉండొచ్చు మన  అధికారులది అనుకుంటూ చర్చించుకుంటున్నారు ప్రజలు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State