సీనియర్ సిటిజెన్లు సమాజానికి చేసిన సేవలు  గుర్తించడం మన బాధ్యత

Aug 22, 2025 - 18:30
 0  3

వారి కృషి, పోరాటపటమ, సామాజిక చింతన  నేటి ప్రపంచ ముఖ చిత్రానికి కారణం కాదా? భరోసా,  ఆదరణ,  గౌరవాన్ని అందించడం మన అందరి కర్తవ్యం.*
************
---  వడ్డేపల్లి మల్లేశం 90142206412
---21...08....2025*******
అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ల దినం  ఆచరణలోకి రావడానికి అనేక మూలాలను   ప్రస్తావించుకోవడం  అవసరం .మానవ జీవితానికి సంబంధించిన ప్రతి అంశం కూడా  చర్చనీయాంశంగా మారినప్పుడు  సమాజాన్ని ప్రభావితం చేసినప్పుడు  ఆ అంశం పైన దృష్టి సారించడం  జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ కీలక అంశంగా మారుతుంది.  ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి  ప్రస్తుత వృద్ధ తర0లో ఉన్నవాళ్లు  వివిధ రంగాల నిపుణులు,  వాళ్లు పోషించిన పాత్ర,సమాజానికి అందించినటువంటి సంకేతాలు,  వివిధ రంగాలను  బలోపేతం చేసిన తీరు, అభివృద్ధి సంక్షేమం శాస్త్రీయ పరిణతికి తోడ్పడిన దాఖలాలను  ప్రస్తావించుకోవడం  అభినందించడం చాలా అవసరం. ఆ పునాదుల మీదనే ప్రస్తుత తరం రాబోయే తరాలు మరింత పరిణతి సాధించడానికి సమాజాన్ని మరింత ముందుకు నడిపించడానికి అంతిమంగా సమ సమాజాన్ని స్థాపించడానికి తోడ్పడుతుంది కదా!  అందుకే సీనియర్ సిటిజన్ల గురించినటువంటి చర్చ ప్రస్తావన కీలక అంశంగా మారింది .ప్రతి ఏటా ఆగస్టు 21న అంతర్జాతీయ సీనియర్ సిటిజెన్ల దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో దాని పూర్వ నేపథ్యాన్ని చర్చించుకోవడంతోపాటు ప్రస్తుత  తరం కూడా సీనియర్ సిటిజనులను ఆదరించడం,  గౌరవించడం,  గుర్తించి వారిద్వారా ప్రేరణ పొందడం చాలా అవసరం. ఆ  సామాజిక బాధ్యత మన అందరి పైన ఉన్నది.
           నేపథ్యం  రోనాల్డ్ రీగన్ అభిమతం :-
*************      మెరుగైన ఆరోగ్య పరిరక్షణతో పాటు  వివిధ రంగాలలో శాస్త్రీయ పరిశోధనలు చేసి ప్రజా జీవితాన్ని మెరుగుపరచినటువంటి సందర్భాలను  ప్రస్తావించుకున్నప్పుడు  దానికి ముఖ్య కారణం గతంలో పని చేసినటువంటి ప్రస్తుత సీనియర్ సిటిజన్లు   అని చెప్పక తప్పదు.అనేకమంది  ఆ రంగాలను ప్రభావితం చేసి  గతి o చిన వాళ్లను కూడా స్మరించుకోవడం ఈ దినోత్సవ ప్రాధాన్యతగా గుర్తించినప్పుడే గతం పునాదుల మీద వర్తమానాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది.  1988లో ఆనాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్  సీనియర్ సిటిజెన్ల స్థితి  స్థితిగతుల పైన వచ్చినటువంటి  ప్రతిపాదనల ఆధారంగా 5847 ప్రకటన పైన సంతకం చేసి  సీనియర్ సిటిజన్లకు కూడా  ఒక దినం  ఉండాలనే ఉద్దేశంతో ఆగస్టు 21 ని  ప్రకటించడం ద్వారా  వృద్ధులను గౌరవించడానికి చొరవ తీసుకోవడాన్ని ముందుగా అభినందించవలసిన అవసరం ఉంది.  ప్రతి కుటుంబముతో పాటు అంతటా వృద్ధులు మన  సమాజాలను తీర్చిన సందర్భాలను ప్రస్తావించుకోవడానికి ఇది వేదిక అవుతుంది.  ఈ సందర్భంగా రీగన్ ప్రకటన  వారి మాటల్లోనే  "మన సమాజాలకు మన దేశానికి  సీనియర్ సిటిజన్లు చాలా సాధించారు అది నేటికీ నిజం రేపటి తరానికి కూడా ఆవశ్యం.  సీనియర్ సిటిజన్ల గౌరవార్థం ఒక ప్రత్యేక రోజును కేటాయించడానికి నాకు అవకాశం వచ్చినందుకు సంతోషం" అని రీగన్ ప్రకటించడం నిజంగా  చారిత్రాత్మకం. ఇంకా వారి మాటల్లో  "వృద్ధులు జీవితాంతం సాధించడానికి వారు సాధిస్తుండడానికి  వృద్ధులకు మా కృతజ్ఞతలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. మన సమాజంలో మరింత పరిమచ్చడానికి వృద్ధులు కావడానికి మంచి ప్రదేశాలు రోజులు పూర్తిగా పాల్గొనగల మరియు స్వాతంత్రం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ప్రోత్సాహం అంగీకారం సహాయం మరియు సేవలను  నేటి తరం అందించడం ద్వారా మనం మన కృతజ్ఞతను చాటుకోవాల్సిన అవసరం ఉన్నది.
      రీగన్ స్వయంగా అందరికీ ఒక ఆదర్శంగా నిలవడం  జనవరి 2o, 19 81న ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షునిగా  ఎంపిక అయ్యేనాటికి ఆయనకు 69 సంవత్సరాలు. రీగన్ స్వయంగా 93 సంవత్సరాల వయసు వరకు జీవించినట్లు  ఆయన పదవీకాలం 77 సంవత్సరాల 349 రోజులకు ముగిసి నప్పుడు ఆయన అత్యంత పెద్దవాడు కావడం  ఈ ప్రకటన చేయడం  సందర్భోచితంగా ఉన్నది.                                కర్తవ్యం ఏమిటి?-సంస్కరణ మనతో ప్రారంభిద్దాం :-
**************                                   "ఇది ఒక దేశానికి మాత్రమే పరిమితం కాదు  ఒకచోట పుట్టిన చిన్న నీటి సెలయేరు  దేశాల గుండా  అంతర్జాతీయ నదిగా  ప్రవహించి నట్లుగా  ప్రపంచంలోని వృద్ధులందరికీ ఈ దినం వర్తిస్తుంది. ఆ రకంగా ఆయా దేశాల పాలకవర్గాలు సమాజాలు  స్వీకరించవలసిన అవసరం ఉన్నది. అందుకు తగి నట్టుగా  కుటుంబాల నుండి వివిధ దశల్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ల యొక్క ఆలనా పాలన చూడవలసిన బాధ్యత కుటుంబ సభ్యులతో పాటు సమాజం పైన ప్రభుత్వాలపైన కూడా ఉన్నది. అందుకు చట్టాలను ఇటీవల భారత పార్లమెంటు చేసినప్పటికీ  ఆ చట్టాల అమల్లో ఏర్పడుతున్నటువంటి సాంకేతిక కారణాల వలన ఇప్పటికీ సీనియర్ సిటిజనులుగా ఉన్నటువంటి వృద్ధులైన తల్లిదండ్రులు అనేక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. వయసులో ఉన్నప్పుడు కుటుంబ సమస్యలతో పాటు జాతీయ అంతర్జాతీయ సమస్యలను  అలవోకగా పరిష్కరించి అనేకమంది ఆయా రంగాలలో నిపుణులైన వాళ్ళు, కాయకష్టం చేసి బ్రతికినవాళ్లు, కార్మికులుగా జీవించిన వాళ్ళు, రైతులుగా  ఇతర చేతివృత్తులలో నిమగ్నమైనటువంటి వాళ్ళు,  దేశ సంపదను పెంచడంలో జాతికి పంచడంలో ప్రజాస్వామ్య పరిరక్షణను కాపాడడంలో  పాల్గొనడం ద్వారా క్రియాశీలక పాత్ర పోషించినప్పటికీ  కుటుంబాలలో ఎదురవుతున్న నిరాదరణ  కొంత ఆందోళనకరంగా మారిన విషయాన్ని అందరం గుర్తించాలి. ఎక్కడికి అక్కడ  తమతోనే ప్రారంభించి సంస్కరించుకోవడం ద్వారా  వాళ్ల గౌరవాన్ని గత జీవిత చరిత్రను  కృషిని అర్థం చేసుకోవడం మన కర్తవ్యంగా స్వీకరించవలసిన అవసరం ఈ సీనియర్ సిటిజన్ల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరి పైన ఉన్నది. "  ఒక తరం ముందుకెళ్లినప్పుడు  నేటి తరం రేపటి సీనియర్ సిటిజన్లుగా మారాల్సిందే  ఆ స్పృహ సోయి  ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు  వివక్షత ఇతర ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉండవు.  ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే సామెత మాదిరిగా  ప్రతి వ్యక్తి కూడా  సాధారణ వ్యక్తి గానే జన్మించి అసాధారణ స్థితిలోకి  జారుకునే అవకాశాలున్నాయి అది వాళ్ళ వాళ్ళ సందర్భాలు, శక్తి యుక్తులు, కుటుంబ నేపథ్యాన్ని బట్టి  అలాంటివాళ్లు జాతికి మరింత పెద్ద మొత్తంలో తోడ్పడతారు.  కానీ జాతి జీవన క్రమంలో దోహదపడక పోయినా తమ కుటుంబ నేపథ్యాన్ని  బాధ్యతలను నిర్వహించడంలో కృషి చేసినటువంటి వాళ్లను కూడా గౌరవించుకోవడం  కుటుంబ సభ్యులతో పాటు సమాజం పైన ఆధారపడి ఉన్నది. ఆ రకమైనటువంటి  సంస్కారాన్ని పెంపొందించడం  మానవ సమాజ పరిణతికి  చాలా తోడ్పడుతుంది.  "గత తరం ద్వారా ప్రేరణ పొందడం,    వర్తమానములో సమర్థవంతంగా జీవించడం,  ఈ వారసత్వాన్ని రేపటితారానికి అందించడంలో సమాజాలు  చేస్తున్న కృషిలో అంతర్భాగం ఈ సీనియర్ సిటిజన్ల యొక్క కృషిని గుర్తించి గౌరవించడం. ఈ సామాజిక బాధ్యతను ఒక తరం మానితే  రేపు రాబోయే తరం కూడా ఆ శిక్ష అనుభవించక తప్పదు అని గుర్తించాలి.  బలవంతంగా చట్టాలను అమలు చేసి  ఆదరణ పొందడం కంటే ప్రేమ అనురాగంతోని వృద్ధులను గౌరవించుకోవడం ద్వారా  ఉత్తమ మానవీయ సమాజాలను నిర్మించుకోవడం అవసరం. ఆ వైపుగా నేటి తరం తన కృషిని కొనసాగించినట్లయితే  సీనియర్ సిటిజన్ల లో ఆత్మవిశ్వాసం పెరిగి ఆదరణతో గౌరవంగా జీవిస్తారు, మరణిస్తారు.  నేటి తరం ఆ గౌరవాన్ని కాపాడుకుంటే మంచిది  అది నేటికీ  ఏనాటికైనా  కాల పరీక్షకు నిలబడుతుంది అనడంలో సందేహం లేదు."
(  సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట TGS)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333