బీఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా మామిడి సైదులు ఏకగ్రీవంగా ఎన్నిక!

Oct 3, 2024 - 20:57
 0  3
బీఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా మామిడి సైదులు ఏకగ్రీవంగా ఎన్నిక!
బీఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా మామిడి సైదులు ఏకగ్రీవంగా ఎన్నిక!

శాలిగౌరారం 03 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- బీఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా శాలిగౌరారం మండల పరిధిలోని మాదారం కలాన్ గ్రామానికి చెందిన మామిడి సైదులుని ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష సమావేశంలో భాగంగా బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నియమించారు.ఈ సందర్భంగా మామిడి సైదులు మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో ఈ గురుతర బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేశారు.బహుజన రాజ్య వ్యాప్తి కోసం తన వంతు శక్తి వంచన లేకుండా కృషి  చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని, రాష్ట్ర కార్యదర్శులు బొడ్డు కిరణ్, దయాకర్, అంబేద్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏకుల రాజారావు, కత్తుల కన్సీరామ్ బిఎస్పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333