బిసి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొండిల్ల శ్రీనివాస్ నియామకం        

Sep 9, 2024 - 21:23
Sep 9, 2024 - 21:24
 0  2
బిసి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొండిల్ల శ్రీనివాస్ నియామకం        

మంచిర్యాల,సెప్టెంబర్ 09 (తెలంగాణవార్త):- జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పట్టణానికి చెందిన కొండిల్ల శ్రీనివాస్ నియామకం అయ్యాడు. ఈ సందర్బంగా శ్రీనివాస్ కు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతు నా పై నమ్మకం తో సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్,రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికిష్ణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్,రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు, డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం మందమర్రి పట్టణ కమిటీ అధ్యక్షునిగా చేసిన కార్యక్రమాలకు నాలుగు సంవత్సరాలుగా సహకరించిన కమిటీ సభ్యుల సహకారం, ప్రత్యేకంగా మీడియా మిత్రుల తోడ్పాటు మరువలేనిదని అన్నారు. బి సి ల సంక్షేమమే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333