మూగజీవాల సౌఖ్యం పశు వైద్యుల రక్షణకై* ఆర్థిక వితరణతో ట్రేవిస్ పునర్నిర్మాణం

Sep 9, 2024 - 20:31
Sep 9, 2024 - 21:37
 0  43
మూగజీవాల సౌఖ్యం పశు వైద్యుల రక్షణకై* ఆర్థిక వితరణతో ట్రేవిస్ పునర్నిర్మాణం

మూగజీవాల సౌఖ్యం- పశువైద్యుల రక్షణకై ఆర్ధిక వితరణతో ట్రెవిస్ ల పునర్ నిర్మాణం

  కీ శే. అలేటి పెదకొండయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సత్యనారాయణ దయాగుణం

కోదాడ పట్టణం లోని ప్రాంతీయపశువైద్యశాలలో పశువుల వైద్యం కోసం వాటిని సురక్షితంగా కట్టి ఉంచడానికి పూర్వం నిర్మించిన బోనులు (ట్రెవిస్). నేల పై కాంక్రీట్ వల్ల అడుక్కి పోయి ఎత్తుతగ్గడంతో, వైద్యం కోసం రైతులు పశువుల్ని తీసుకు వచ్చినప్పుడు , బోను ఎత్తు సరిపోక ఇంజక్షన్లు ఇచ్చే సమయములో భయంతో పశువులు 

 పైకి ఎగిరి బోను వెలుపలికి పడటం దెబ్బలు తగలడం అలాగే వైద్యం చేసే వైద్యులకి సైతం గాయాలు కావడం జరుగుతుంది

 తన ఆవు వైద్యంకోసం ప్రాంతీయ పశువైద్య శాలకు వచ్చిన సత్యనారాయణ పరిస్థిని పరిశీలించి వారి నాన్న గారి జ్ఞాపకార్థం అయిదువేల రూపాయల వితరణతో పశువుల కి మరియు వైద్యులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా వైద్యం చేయడానికి వీలుగా వైద్యశాలలోని బోన్లని తొలగించి కావసినంత మేరకు ఎత్తులేపి తిరిగి బోన్లను నిర్మించడం జరిగింది

   సత్యనారాయణ సేవాగుణంతో ప్రాంతీయ పశు వైద్యశాలకి వైద్యంకోసం వచ్చే రైతులకి సౌకర్యవంతమైన వైద్యం అందించగలుగుతున్నామని ప్రాంతీయ పశువైద్య శాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య తెలిపారు

      మూగ జీవాల సంరక్షణకు ముందుకు వచ్చిన దాత వితరణను పశుపోషకులు అభినందిస్తున్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State