బల్గేర  ప్రైవేటు ఆసుపత్రి సీజ్

Jul 4, 2024 - 20:19
 0  4
బల్గేర  ప్రైవేటు ఆసుపత్రి సీజ్

 మండలం ,గట్టు గ్రామం, బల్గేర గ్రామం , మాచర్ల గ్రామం లోని ఆర్ఎంపీలు నిర్వహించు ప్రథమ చికిత్స కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు....ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ శశికళ మరియు ఉప- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్కే సిద్దప్ప మరియు మాత శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ జి స్రవంతి మరియు కె. మధుసూదన్ రెడ్డి బల్గేరా గ్రామంలో ఎస్ .కేశవ నాయుడు , అన్ రిజిస్టర్  ప్రాక్టీషనర్, "సాక్షి పాలి క్లినిక్ " అనే పేరుతో  క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 మరియు రూల్స్-2011 ప్రకారం ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా " సాక్షి పాలి క్లినిక్"  నిర్వహిస్తున్నారు.. ఈ పాలి క్లినిక్ లో ఆక్సిజన్ సిలిండర్లు , Baby Warmer,SPO2( ఆక్సిజన్ శాతాన్ని కొలిచే మిషన్)  మిషన్ , 5 బెడ్స్, ఐ వి స్టాండ్స్, అధిక మొత్తంలో మెడిసిన్స్ (మినీ ఫార్మసీ) ప్రవేట్ హాస్పిటల్స్ కు రిఫర్ చేసే రెఫరల్ స్లిప్స్, ప్రైవేటు ల్యాబ్స్ కు ప్రిఫర్ చేసే రెఫరల్ స్లిప్స్, ఉండడము, ఈ వ్యక్తికి అల్లోపతి ప్రాక్టీస్ చేసేందుకు ఎటువంటి అర్హత లేనందువల్ల  మరియు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా"" సాక్షి పాలి క్లినిక్""  నిర్వహిస్తున్నందువల్ల, జిల్లా అధికారులు ఈ క్లినిక్ ని మూసివేయడం జరిగింది...
అదేవిధంగా, బల్గేర గ్రామంలో 'నర్సింలు'  నిర్వహించు ప్రథమ చికిత్స కేంద్రంలో అధిక మొత్తంలో యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ , ఇంజక్షన్స్ , సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, నేబలైజర్, అధిక మొత్తంలో మెడిసిన్స్ ఉన్నందువల్ల ,ఈ మెడిసిన్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇకపై ప్రథమ చికిత్స ప్రకారం చికిత్సలు నిర్వహించకుండా అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించినట్లయితే క్రిమినల్ కేస్ బుక్ చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు ఆదేశించారు.గట్టు గ్రామంలో రాఘవేంద్ర గుప్తా,అనే వ్యక్తి ప్రథమ చికిత్స కేంద్రం నిర్వహిస్తున్నారు, ఈ ప్రథమ చికిత్స కేంద్రంలో వాడిన సిరంజిలు సూదులు, కాటన్, గ్లూకోజ్ బాటిళ్లు, వైల్స్, అంపుల్స్, అన్ని ఒకటే బాక్స్ లో వేయడం జరిగింది వీటిని అన్నిటిని బయో మెడికల్ వేస్టేజ్ ప్రకారము డిస్కార్డు చేయవలసిందిగా జిల్లా అధికారులు ఆదేశించడం జరిగింది లేనిచో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారము చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333