కెసిఆర్ తో సహా నాటి క్యాబినెట్ మంత్రులందరిని  అరెస్టు చేయాలి.

కొల్లు కృష్ణారెడ్డి

Feb 16, 2024 - 16:27
Feb 16, 2024 - 17:39
 0  4
కెసిఆర్ తో సహా నాటి క్యాబినెట్ మంత్రులందరిని  అరెస్టు చేయాలి.

కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాగ్ నివేదిక ఇచ్చిన సమాచారం ఆధారంగా వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి అతని క్యాబినెట్ మంత్రులందరినీ వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని తెలంగాణ జన సమితి మండల అధ్యక్షులు కొల్లు కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ నాయకులతో కలిసి ఈరోజు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కెసిఆర్ అక్రమాలకు పాల్పడుతున్నాడని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మొదటి నుండి ఆధారాలతో సహా చెబుతున్నాడని అయినా ఏవీ లెక్క చేయని కేసీఆర్  కమిషన్లకు కక్కుర్తి పడి వేలకోట్ల ప్రజా సొమ్మును దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు. తాము గొప్పగా చెప్పుకుంటున్న కాలేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన ఘట్టమైన మేడిగడ్డ పునాదుల నుండి నేర్రలు బాసి కృంగిపోయిందని ఈరోజు ఆ ప్రాజెక్టు ఉపయోగం లేకుండా పోయిందని దాని ఆధారంగా నిర్మించిన మిగతా బ్యారేజీలు లిఫ్టులు రిజర్వాయర్లు వాటి కోసం వెచ్చించిన వేలకోట్ల రూపాయలు వృధా అయిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో జరిగిన తప్పును ఒప్పుకొని ప్రజలను బహిరంగ క్షమార్పణ కోరాల్సింది పోయి ఇంకా కెసిఆర్ దబాయింపులకు బుకాయింపులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో రైతు జన సమితి జిల్లా ఉపాధ్యక్షులు తండు రాములు గౌడ్, ఎస్ టి సెల్ జిల్లా కార్యదర్శి జాటోతు శ్రీను నాయక్ ,విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్ ,యువజన సమితి ఆత్మకూరు మండల అధ్యక్షులు గడ్డం యాకోబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333