ప్లాస్టిక్ ను నిర్ములన చేద్దాం
జోగులాంబ గద్వాల 14 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వడ్డేపల్లి శాంతినగర్ లో ఆదివారం రోజు శాంతినగర్ సేవా సమితి వడ్డేపల్లి సభ్యులు సమావేశం నిర్వహించారు. సేవా సమితి దృష్టి కి వచ్చిన పలు సమస్యలు చర్చించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిర్ములన కు పూర్తి స్థాయి లో కృషి చేద్దామని తీర్మానం చేశారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు. అనంతరం సేవా సమితి కి అన్ని విధాలా సహకారం అందిస్తున్న మీ సేవా రవి, సోమశేఖర్ కు శాలువా తో సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో షేక్ అస్లాం షరీఫ్, దాసువరం నాగరాజ్, మహేష్, రమేష్, మాలిక్, హరీష్, రాకేష్ పాల్గొన్నారు.