ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ అద్భుతం.... ఎం ఈ ఓ చత్రు నాయక్
నేరేడుచర్ల 20 ఏప్రిల్ 2023
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ అద్భుతమని ఎంఈఓ చత్రు నాయక్ అన్నారు.శుక్రవారం వెలువడిన గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలలో నేరేడుచర్ల మండలం పులగం బండ తండ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఆరుగురు విద్యార్థులు విజయకేతనం ఎగరవేయటం జరిగినది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు పి శ్రీధర్ శిక్షణలో భాగంగా ఆరుగురు విద్యార్థులు గురుకుల సీట్లు సాధించడం ఎంతో గర్వకారణమన్నారు.గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చిన ప్రధానోపాధ్యాయులను విద్యార్థులను అభినందించారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత చదువు చదివి ఉన్నత శిఖరాలు అవరోధించాలని కోరారు.ఎంపికైన విద్యార్థులు బానోతు సిద్ధార్థ,హర్షవర్ధన్,సందీప్, అలేఖ్య,సింధు,ధీరావత్ నర్మద ల పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు,గ్రామస్తులు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బంటు మధు,కార్యదర్శి ఇంజమూరి వెంకట్ అంగన్వాడి టీచర్ సైదమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.