ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగిస్తూ, ప్రభుత్వా ప్రాపర్టీ నీ ధ్వంసం చేసిన కేసులో 9 మంది నిందితులకు నెల రోజుల జైలు శిక్షా

మరియు ఒక్కొక్కరికీ 1000/- రూపాయల జరిమానా.
జోగులాంబ గద్వాల5 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ప్రభుత్వా ప్రాపర్టీ ను ధ్వంసం చేసిన కేసులో 9 మంది నిందితులకు నెల రోజుల జైలు శిక్షా మరియు ఒక్కొక్కరికీ 1000/- రూపాయల జరిమానా విధిస్తూ 1st ADJ కోర్టు జడ్జి మహబూబ్ నగర్ . ఈ రోజు తీర్పును వెల్లడించారు. కేసు యొక్క వివరాలు
వివరాలు: తేది:07.11.2017 నాడు జిల్లా మార్కెట్ అధికారి శ్రీమతి s.పుష్పమ్మ గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అదే రోజు రోజువారీ విధులను నిర్వహిస్తుండగా మధ్యాహ్నo 2:30 గంటల సమయంలో సుమారు 20 నుండి 30 వరకు రైతులు వేరు శనగ కాయకు ధరలు తక్కువగా వచ్చినదని తన పై వాగ్వివాదం చేసి కార్యాలయం లో ఉన్న పర్నెచర్, గ్లాస్ అద్దములు, కిటికీ అద్దములు, తలుపులు, మెయిన్ డోర్ గ్లాస్ అద్దములు, కంప్యూటర్ మరియు కార్యదర్శి గారి మెయిన్ డోరు అద్దములు, మైక్ సెట్, బీరువా లు, పూల కుండీలు తదితర ఫర్నిచర్ ధ్వంసం చేసి తమ విధులకు ఆటంక పరిచారని, అట్టి రైతులలో కొందరి పేర్లు పింజరి గోకారీ, బోయ సవారన్న , మరి కొందరు అనీ అట్టి వారి పై చట్టపరమైన చర్య తీసుకోవాలని పిర్యాదు ఇవ్వగా గద్వాల్ టౌన్ పోలీసులు క్రైమ్ no 409/2017 u/s 427, 453 r /w 34 IPC and 3 PDPP Act గా కేసు నమోదు చేసుకొని అనంతరము విచారణ చేపట్టిన అప్పటి ASI రాఘవులు, ఎస్సై శ్రీనివాస్ చేపట్టిన విచారణలో ప్రధానంగా 9 మంది నిందితులు దాడి చేసినట్లు తేలడంతో నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది. తదుపరి పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది.
జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాను సారం డి.ఎస్పి శ్రీ వై. మోగిలయ్య సూచనలతో మహబూబ్ నగర కోర్టులో కేసు ట్రయల్ సమయంలో గద్వాల్ సిఐ టి శ్రీను, టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్ లు కోర్టులో సాక్ష్యం చెప్పే విధంగా సాక్షులను మోటివేట్ చేయడం జరిగింది.
ఆరోజు నుండి ఈరోజు వరకు 1st ADJ మహబూబ్ నగర్ కోర్టు లో కేసు విచారణ జరిగింది. ఈరోజు 1st ADJ మహబూబ్ నగర్ కోర్టు జడ్జి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి . ఇరువురి వాదనలు విన్న తర్వాత నేరస్థుల పై నేరం రుజువైనoదున నిందితులు A1- పింజరి గోకారి s/o దౌలన్న, వయసు -45 సం "లు R /o మన్నాపురం గ్రామం, ధరూర్ మండలం.
A 2- MD . మహబూబ్ s/o MD అలీ సాబ్, వయసు - 29 సం "లు R/o మన్నాపురం గ్రామం, ధరూర్ మండలం.
A 3- గుడిసె సవారన్న s/o నడిపి సవారన్న , వయసు - 36 సం "లు R /o పారుచర్ల గ్రామం, ధరూర్ మండలం.
A4- కుర్వ బీముడు s/o కేశన్న, వయసు -48 సం"లు, R/o మన్నపురం గ్రామం, ధరూర్ మండలం
A5-MD. మైబు s/o MD నబీ సాబ్, వయసు -45, మన్నపురo గ్రామం, ధరూర్ మండలం,
A6- MD ఖాజా హుస్సేన్ s/o MD. ఖాసిం సాబ్, వయసు - 28, R/o మన్నా పురం గ్రామం, ధరూర్ మండలం
A7- నరేష్ s/o నర్సింహులు , వయసు -30 సం "లు, R/o మన్నాపురం గ్రామం, ధరూర్
A8- గోవిందు s/o దరెన్న, వయసు - 30, R/o మన్నాపురం, ధరూర్
A9- మధ్యలబండ వెంకటేష్ s/o సవరన్న, వయసు -35 , R/o మన్నాపురం ధరూర్( అందరి వృత్తి వ్యవసాయం)
ల కు 427 IPC , 3PDPP యాక్ట్ క్రింద నెల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 1000/- రూపాయాల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
నేరస్థులకు జైలు శిక్ష పడడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ కుమార్ రెడ్డి, కోర్టు లైజనింగ్ ఏ . ఎస్సై నర్సింహులు సహకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి అప్పటి గద్వాల్ టౌన్ ఏ.ఎస్సై రాఘవులు, ఎస్సై లు. టి.శ్రీనివాస్, సత్యనారాయణ ప్రస్తుత ఎస్సై కళ్యాణ్ కుమార్ లను మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ కుమార్ రెడ్డి, కోర్టు లైజనింగ్ ఏ . ఎస్సై కె .నర్సింహులు లను జిల్లా ఎస్పీ అభినందించారు.