**పెన్షనర్ల హక్కులకు పెను ప్రమాదంగా మారనున్న పెన్షన్ సవరణ బిల్లు నిరసిస్తూ""జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన*

Jun 23, 2025 - 17:37
 0  23

*పెన్షనర్ల హక్కులకు పెను ప్రమాదంగా మారనున్న పెన్షన్ సవరణల బిల్లు నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెన్షనర్ల ఆందోళన .*  

ఖమ్మం : పెన్షనర్ల హక్కులకు భంగం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం గత మార్చి నెలలో పెన్షన్ సవరణల బిల్లును ఆమోదించింది . ఈ బిల్లు చట్టంగా రూపొందితే లక్షలాదిమంది పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైడిపల్లి శరత్ బాబు , టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు ఆందోళన వెలిబుచ్చారు . ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన పెన్షనర్ల నిరసన ధర్నాలు వారు పాల్గొని మాట్లాడుతూ పెన్షన్ సవరణల బిల్లు వలన పెన్షనర్లే కాకుండా ఉద్యోగస్తులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని భవిష్యత్తులో పిఆర్సి ఆర్థిక ఫలాలు అందకుండా పెన్షనర్లను అనేక రకాలుగా విభజించే పరిస్థితులు రానున్నాయని పే రివిజన్ ద్వారా వచ్చే ఆర్థిక ఫలాలను సీనియర్లకు అందించకుండా జూనియర్లకు అందిస్తూ వారి మధ్య విభేదాలు ఏర్పడడానికి ఇటీవల ఆమోదించిన సవరణల బిల్లు ముఖ్య ఉద్దేశమని అన్నారు . ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా లేడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో పెన్షనర్లు తమ హక్కులను రక్షణ కోసం ఆందోళన చేపట్టారని అన్నారు . ఈ ఆందోళన కు సంపూర్ణ మద్దతును తెలుపుతూ భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలిపారు . జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బయ్య , జిల్లా కార్యదర్శి తాళ్లూరి వేణు మాట్లాడుతూ నేడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో పెన్షనర్లు ఇటీవల సవరించిన పెన్షన్ సవరణల బిల్లును వెంటనే నిలుపుదల చేసి పెన్షనర్లు హక్కులను రక్షించాలని కోరారు . పెన్షనర్ల మధ్య విభేదాలు సృష్టించవద్దని ఆర్థిక ఫలాలు అందరికీ సమానంగా అందించాలని అన్నారు . పేరు రివిజన్ కమిటీ ఆర్థిక ఫలాలు అందరికీ వర్తించే విధంగా చట్టం రూపొందించి పెన్షనర్ హక్కులకు భంగం కలిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు . ఉద్యోగ విరమణ తేదీ ఆధారంగా పెన్షనర్లను వివిధ రకాలుగా వర్గీకరించవద్దని వృద్ధాప్యంలో అనేక అవసరాలు ఉన్న సందర్భంలో పెన్షన్ తగ్గించడం లేదా పి ఆర్ సి ఫలాలు నిరాకరించడం లాంటి చర్యలను ప్రభుత్వాలు చేపట్టవద్దని పేర్కొన్నారు . వెయ్యి మంది పెన్షనర్లతో కూడిన సంతకాలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపించాలని వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందించడం జరిగింది . నిరసన ధర్నా అనంతరం ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి 45 పేజీలతో కూడిన జిల్లా వ్యాప్త పెన్షనర్ల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీకి పంపించాలని కోరారు . ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు టి జనార్దన్ రావు , కోశాధికారి డి కె శర్మ , జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఆర్ దుర్గాదేవి , జిల్లా కార్యదర్శి తాళ్లూరి వేణు , జిల్లా నాయకులు పి సాంబశివరావు , వై కాజా మొయినుద్దీన్ , ఎస్ పూర్ణచందర్రావు , పి రాజారావు , కూతురు కృష్ణమూర్తి , చెల్లి బాబురావు , వి బాబురావు , ఖమ్మం నగర శాఖ నాయకులు రాధాకృష్ణ , ఆర్ వెంకటనారాయణ , బసవరావు కృష్ణమూర్తి , ఆదినారాయణ , యు వెంకటేశ్వర్లు , గురవయ్య , వెంకటేశ్వర్లు , రమేష్ , శంకర్ మరియు రిటైర్డ్ పోలీస్ సంఘం , జిల్లా బాధ్యులు ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు .

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State