డబుల్ రోడ్డు లేక ప్రజలకు, వాహనదారులకు పడరాని పాట్లు
వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలి-సీపీఎం మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్
ఎమ్మెల్యే మందుల సామేల్ చొరవ తీసుకోవాలి
అడ్డగూడూరు 09 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తాలో సీపీఎం పార్టీ అడ్డగుడూరు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించాడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఎం అడ్డగుడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ఈ రహదారిపై అనేక వాహనాలు వందలాది మంది నిత్యం ప్రయాణం చేసే రహదాని ఎందుకు ఆలస్యం చేస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతయినా ఉందన్ని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ సొంత మండలం అయిన కూడా పనులు ఎందుకు ఆలస్యంగా అయితున్నాయో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి!తక్షణమే పనులను ప్రారంభించి ప్రజల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తారు.అదే విధంగా మండల కేంద్రం చుట్టూ ఉన్న లింక్ రోడ్డులను పూర్తి చేస్తానని ఎన్నికల హామీల్లో హామీ ఇవ్వడం జరిగింది.కానీ ఇప్పటి వరకు దాని ఊసే లేకుండా పోయింది అన్ని అన్నారు.అదే విధంగా అర్హులైన పేదలకు రేషన్ కార్డ్ లు మరియు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మాజీ మండల కార్యదర్శి వళ్ళంబట్ల శ్రీనివాసరావు,సీపీఎం లక్ష్మీదేవికాల్వ గ్రామశాఖ కార్యదర్శి బండి నర్సింహా స్వామి,ఆకుల సోమల్లు,మామిడ్ల నర్సయ్య,నాగయ్య,భద్రయ్య,సతీష్,సోమయ్య,యాదగిరి, యాకుబ్,తదితరులు పాల్గొన్నారు.