ప్రతి గ్రామాంలో దండోర జెండా ఆవిష్కరించాలి: చింత వినయ్ బాబు మాదిగ

Jul 24, 2024 - 20:46
Jul 25, 2024 - 09:01
 0  15
ప్రతి గ్రామాంలో దండోర జెండా ఆవిష్కరించాలి: చింత వినయ్ బాబు మాదిగ
ప్రతి గ్రామాంలో దండోర జెండా ఆవిష్కరించాలి: చింత వినయ్ బాబు మాదిగ
ప్రతి గ్రామాంలో దండోర జెండా ఆవిష్కరించాలి: చింత వినయ్ బాబు మాదిగ


సూర్యాపేట 24 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-  స్థానిక డాక్టర్! బాబు జగ్జీవన్ రామ్ భవన్ జమ్మిగడ్డ సూర్యాపేట నందు ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం MRPS జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మహాజనసోషలిస్టు పార్టీ (MSP) సూర్యపేట జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ హాజరై మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై మహాజన నేత  మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు రాష్ట్రం లోని అన్ని గ్రామాలలో MRPS, MSP గ్రామా కమిటీలు నిర్మాణo చేయాలనీ మరియు దండోర జెండాలు ఆవిష్కారిoచాలని అన్నారు. గత 30సo”రాల సామాజిక న్యాయ MRPS పోరాటాన్ని చూసి గౌరవ శ్రీ నరేంద్రమోడీ గారు మాదిగల విశ్వరూప మహాసభకు హాజరై భావోద్వేగంతో మాట్లాడి మనకు అoడగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది..అందుకు మనం బిజెపి పార్టీకి మద్దతు పలికి అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బిజెపి పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. త్వరలోనే SC రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్యం నెరవేరనుందనీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ, MRPSజాతీయకార్యదర్శి బొజ్జసైదులు మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా నాయకులు కొత్తపెళ్లి ఆంజనేయులు, జిల్లా సీనియర్ నాయకులు పుట్టల మల్లేష్, అంజపెళ్లి శ్రీనివాస్ మాదిగ, దైదశ్రీను మాదిగ, మాదిగవిద్యార్దిసమైక్య(MSF)జిల్లా కన్వీనర్ పండింటి్ నవీన్ మాదిగ, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు బొజ్జవెంకన్న మాదిగ, ఆత్మకూర్(ఎస్) మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ, సూర్యాపేటమండల అధ్యక్షులు తాటిపాముల నవీన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పాతకోటి నాగరాజు,ములుగురి రాజు మాదిగ, మాదిగమహిళాసమాఖ్య (MMS)నాయకురాలు మామిడిసంధ్య మాదిగ, మాదిగ జర్నలిస్ట్ సమాఖ్య( MJF) నాయకుడు ఒగ్గువిశాఖ్ మాదిగ, (VHPS) వికలాంగులహక్కులపోరాటసమితి జిల్లా ఉపాధ్యక్షుడు,కార్యదర్శి చింతసాంబయ్య మాదిగ, మిద్దెసైదులు మాదిగ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు మిరియాల చిన్ని మాదిగ, చెరుకుపల్లి మైకల్ మాదిగ, పంతం గురవయ్య మాదిగ, పంతం లింగయ్య మాదిగ, బొజ్జభరత్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333