బిఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్.....

Dec 18, 2024 - 19:19
 0  1
బిఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్.....

హైదరాబాద్ డిసెంబర్ 18 కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి ఈరోజు సాయంత్రం బెయిల్‌ మంజూరైంది. లగచర్ల కేసులో నరేందర్‌ రెడ్డి,సహా నిందితులుగా ఉన్న 24 మంది రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ ఇచ్చింది. అంతకు ముందే కొండగల్‌ కోర్టులో బెయిల్‌ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రవ్యా ప్తంగా నమోదు చేసిన కేసులన్నింటినీ నాంపల్లి లోని ప్రత్యేక కోర్టులో విచారించాలని ఇప్పటికే ఆదేశాలున్నాయి. ఈ మేరకు ఈ కేసును కొండగల్‌ కోర్టు నాంపల్లి కోర్టుకు బదిలీ చేసింది. నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి వాదనలు కొనసాగాయి. లగచర్ల కేసులో పట్నం నరేందర్‌రెడ్డిని ఏ1గా చాలా మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో నరేందర్‌రెడ్డి చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీ గా ఉన్నారు.ఈ కేసులో ఇప్పటికే నరేందర్‌ రెడ్డిని, నిందితులను కస్టడీకి తీసుకుని విచారిం  చారు. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్‌ రెడ్డితో మిగతా నిందితులంతా దర్యాప్తు నకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ల తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నరేందర్‌రెడ్డి రూ. 50 వేలు, మిగతా వారు రూ. 20 వేల పూచికత్తు సమర్పించాలని ఆదేశిస్తూ.. నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333