ప్రజావాణి దరఖాస్తుకు స్పందించిన యువజన, క్రీడల అధికారి.
క్రీడా సంఘాల ,వాకర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రభాకర్.
జోగులాంబ గద్వాల 20 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ఉన్న ఇండోర్ స్టేడియం ప్రక్కన ఉన్న ఫంక్షన్ హాల్ నుండి వెదజల్లుతున్న కాలుష్యాన్ని నివారించి తగు చర్యలు సంబంధిత ఫంక్షన్ హాల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రాంబలింగేశ్వర గౌడ్ తమకు లిఖితపూర్వకంగా తెలిపినట్లు క్రీడా సంఘాల, వాకర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శంకర ప్రభాకర్ తెలిపారు. ప్రజావాణిలో సమర్పించిన వినతిపత్రంలో గద్వాల ఇండోర్ స్టేడియంలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడంతో పాటు, స్టేడియం ప్రక్కన ఉన్న ఫంక్షన్ హాల్ నుండి వెలువడుతున్న పొగ వల్ల క్రీడాకారులు మరియు వాకర్స్ కు కలుగుతున్న అసౌకర్యం అలాగే ఇండోర్ స్టేడియంలో ఉన్న గదులను అద్దెకు ఇవ్వుటకు సంబంధించిన అంశాలపై చేసిన ఫిర్యాదును పరిశీలించడం జరిగిందనీ,ఇండోర్ స్టేడియంలో మరుగుదొడ్డ నిర్మాణ,మరమ్మత్తు పనులు త్వరలో ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేయడం జరుగుతుందనీ అదేవిధంగా క్రీడాకారులు, వాకర్స్ సౌకర్యార్థం తాగునీటి సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందనీ, ఇండోర్ స్టేడియంలో ఉన్న 6 గదులను అద్దెకు ఇవ్వుటకు సంబంధించిన మీ వినతిని కూడా పరిశీలనలో ఉంచడమైనదనీ, సంబంధిత నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు విషయాన్ని పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనీ జిల్లా యువజన క్రీడల అధికారి రామలింగేశ్వర్ గౌడ్ తెలిపినట్టు శంకర్ ప్రభాకర్ తెలిపారు.