తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ప్రకారం 11% ఎస్సీ రిజర్వేషన్ల వాటాన్ని ఇచ్చి అమలు చేయాలి:
యాతాకులరాజన్న మాదిగ,MSP జిల్లా అధ్యక్షులు
స్వార్థపరుల మాట విని మా వాటా తగ్గిస్తే రేవంత్ రెడ్డి కి గద్దె దించుదాం:
యాతాకులరాజన్న మాదిగ,MSP జిల్లా అధ్యక్షులు
సూర్యపేట 17 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- స్థానిక సూర్యపేట జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ జమ్మిగడ్డలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య సమావేశంలో మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏతాకుల రాజన్న మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా కన్వీనర్ ఏపూరి రాజు మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో జనాభా కులగనన లో మాదిగలు 10.3% ఉన్నారని లెక్కలు తేల్చింది, గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి మిత్రులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు SC రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసే ప్రక్రియలో మాదిగల జనాభా ప్రాతిపదికన మాదిగల వాటా 11% రావాలని ఆనాడే సామాజిక పరివర్తలు సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేశారు అయినా కొంతమంది జాతి ద్రోహులు స్వార్థపరుల మాట విని మా వాటా తగ్గిస్తే ఊరుకునేది లేదని రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య బద్దంగా తప్పదని హెచ్చరించారు మా వాటా 11 శాతాన్ని వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ,MRPS జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ములకలపల్లి రవి మాదిగ,ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజుఎంఎస్పి మునగాల మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను, కొండపల్లి సూర్యప్రకాష్ ఎమ్మార్పీఎస్ అనంతగిరి మండల అధ్యక్షులు ఆకారపు కొండలు ఎమ్మెస్ పి అనంతగిరి మండల అధ్యక్షులు పందింటి నవీన్ కుమార్ ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ఎమ్మార్పీఎస్ పట్టణ నాయకులు మండి కత్తి గోపీచంద్ మాదిగ, చందుపట్ల జనార్ధన్ మాదిగ రాజేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు