ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
తిరుమలగిరి 20 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- 187 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేదికలను తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కెమెరా సృష్టికర్త లూయిస్ మండే డాగ్యూరె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండల అధ్యక్షులు సుంకరి సుధీర్ ఫోటోగ్రఫీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.స్థానిక ఎస్సై వెంకటరెడ్డి కీ శాలువాతో సన్మానించారు. ఫోటోగ్రాఫర్ల సమస్యలపై సమావేశం నిర్వహించి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ధరలను నిర్ణయించి యూనియన్ సభ్యులు పాటించాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ ఫోటోగ్రాఫర్ వంగూరి యాదగిరి, ఉపాధ్యక్షుడు పరశురాములు,ప్రధాన కార్యదర్శి దామెర రమేష్,కోశాధికారి సన్నీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము భాస్కర్, కార్యదర్శి మహేష్, కుటుంబ భరోసా ఇంచార్జి బోండ్ల అర్జున్, సీనియర్ ఫోటో గ్రాఫర్లు శ్రీరాములు, నారాయణ, మల్లేష్, కిష్టు నాయక్, గంగాధర్, అశోక్, కళాశ్రీప్రవీణ్,శ్రీనివాస్,సంతోష్, మహేష్, బాబేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.