పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి. 

Mar 13, 2024 - 20:14
 0  36
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి. 
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి. 

ఐజ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ  రితిరాజ్,IPS  .

జోగులాంబ గద్వాల 13 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఐజ. 17 మంది నుండి పిర్యాదులను స్వీకరించి చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిపోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ . ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని , ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని  జిల్లా ఎస్పీ  రితిరాజ్, IPS  పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఐజ పోలీస్ స్టేషన్ ను సందర్శించి గతం లో నమోదు అయిన కేసులను పరిశీలించారు. గత సంవత్సరం నాన్ గ్రేవ్ కేసులలో UI లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించి వారికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించి పక్బందీగా గా విచారణ పూర్తి చేసి ఫైనలైజ్ చేయలని అన్నారు. కోర్టు లలో చార్జిషీట్ వేసిన కేసులలో వెంటనే CC నెంబర్ల పొందాలని అన్నారు. కేసులను చేదించడం లో మంచి ఎఫర్ట్స్ పెట్టాలని ఎస్సై నీ ఆదేశించారు. ప్రాపర్టీ కేసులలో ప్రత్యేక దృష్టి పెట్టాలని , పని చేయని CC కెమేరాలను వెంటనే పునరుద్ధరించాలని ,  కమ్యూనిటీ పోలీసింగ్ లో బాగంగా CC కెమెరాల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలని అన్నారు. మున్సిపాలిటీ లో కాలనీల స్థానికులతో మాట్లాడి ఎంట్రన్స్ దగ్గర CC కెమేరాలు ఏర్పాటు చేయించాలని అన్నారు . ఆయా కేసులలో FSL రిపోర్ట్స్ పెండింగ్ లేకుండా చూడాలని, వెంటనే రిపోర్ట్స్ తెపించుకొని కోర్టు లో చార్జి షీట్ వేయాలని అన్నారు.  గతం లో నమోదు అయిన కేసులు ఏ ఏ స్ధాయిలో ఉన్నాయే తెలుసుకొని,విచారణ పెండింగ్ లో ఉండటానికి గల కారణాలను పరిశీలించి పలు సూచనలు చేశారు .పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు.  పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ  ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.  డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని ,  సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, ప్రజలకు ఎల్లపుడు  అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను, డయల్ -100,  సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదును ఆన్లైన్లో లో ఎంట్రీ చేసి తీసుకున్నా చర్యలను బాధితులకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని , ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని సూచించారు. 

పిర్యాదుదారుల నుండి 17 పిర్యాదులు స్వీకరణ ఐజ మండల ప్రజలకు ఈ రోజు అందుబాటులో ఉంటానని రెండు రోజుల క్రితం పత్రికా ప్రకటన ద్వారా ఎస్పీ  తెలియజేసినందున ఈ రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చిన 17 మంది పిర్యాదు దారుల నుండి ఎస్పీ పిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  వారితో స్వయంగా మాట్లాడి అట్టి పిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు.  ఫిర్యాదుల కు సంబందించి  ప్రేమ పెళ్లి చేసుకున్న తమకు భద్రత కల్పించాలని, కేసు నమోదు అయిన అరెస్టు చేయకపోవడం గురించి, ఆడపిల్లలు పుట్టారని భర్త వదిలేశాడు అనీ, డబ్బులు తీసుకొని ఇంటి పక్క వారు ప్లాట్ ఇవ్వలేదని, పక్క పొలం వారు భూమిని కబ్జా చేశారని, తాతల కాలం నుండి వచ్చిన భూమిని బాగా పరిష్కారాలు చేయకుండా అడ్డుకుంటున్నారు అని, సైబర్ క్రైమ్ మోసాల గురించి, పక్క పొలం వారు దాడి చేశారని, ప్లాట్ కబ్జా చేశారని, పక్క పొలం వారు మాపై దాడి చేసి మా 
 పై కేసు పెట్టారని, భర్త వేధిస్తున్నాడు అనీ, ముగ్గురు పిలల్లు ఉన్న మహిళ కు తన భర్త చనిపోగా బాగా పరిష్కారాలు చేయడం  లేదని వంటి పిర్యాదులు రాగ జిల్లా ఎస్పీ  వాటిని పరిశీలించి భార్య భర్తల పిర్యాదుల పై వెంటనే కౌన్సిలింగ్ కు పంపాలని, సైబర్ క్రైమ్ కు సంభందించి ఫ్రీజ్ చేసిన అమౌంట్ ను కోర్టు అనుమతి ద్వారా బాధితులకు అప్పగించాలని అన్నారు . వచ్చిన ప్రతి పిర్యాదు పై  పకడ్బందీగా విచారణ చేసి  వెంటనే చట్ట ప్రకారం పరిష్కరించాలని ఎస్సై, సి. ఐ గారిని ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో  డి.ఎస్పీ శ్రీ కె.సత్య నారాయణ , శాంతి నగర్ సి.ఐ రత్నం , ఐ జ ఎస్సై విజయ్ భాస్కర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333