పేదోడి కడుపు నింపేఅందుకే సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గంగుల వెంకటేష్

మరిపెడ 05 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- మహబూబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన పట్టణ కాంగ్రెస్ యువజన యువ.నాయకులు గంగుల వెంకటేష్ మాట్లాడుతూ.. పేదల పెన్నిధి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు విధానం నిరుపేద ప్రజానేకానికి ఒక అన్నదాన ప్రసాదం చేసిన మహోన్నతమైన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు చేపట్టిన పథకం పేదలకు ఎంతో మేలు కరమైనదని గంగుల వెంకటేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం చాలా సంతోషం దేశంలో ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో 15 నెలలు అయినా తరువాత ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా అర్హులైన పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం చారిత్రాత్మకం, నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి 1200 ఆదా, లిరేషన్ కార్డు పై పేదలకు సన్న బియ్యం రాష్ట్ర ప్రజలకు ఏటా పదివేల కోట్ల వరకు లబ్ధి,కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యం పంపిణీ చేయడం వలన తెలంగాణ రాష్ట్రంలో పేదోడి కల సహకారమైంది ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం వలన రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే కాంగ్రెస్ సర్కార్, ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి మంచి మంచి పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి సహకారం చేస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.