పెరగనున్న ఔషధాల ధరలు!
పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి అత్యవసర మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నిత్యావసర ఔషధాల జాబితాలోని మందుల ధరలను 0.0055% పెంచనున్నట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ వెల్లడించింది. కానీ గత సంవత్సరం..
అంతకు ముందు సంవత్సరం పెంపులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఔషధాల ధరలు 2022లో 10% మరియు 2023లో 12% పెరిగాయి.