మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు

సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య

Apr 19, 2026 - 22:20
Apr 19, 2026 - 22:32
 0  1
మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు
మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు
మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు

దక్షిణాది రాష్టాలను దెబ్బతీసే డి లిమిటేషన్కు మాత్రమే వ్యతిరేకం

మహిళల అభివుద్దికి అప్పుడు ఇప్పుడు పాటుపడేది కాంగ్రెస్ మాత్రమే

కుల, మతాలతో రాజకీయం చేసే బీజేపి కాంగ్రెస్ పై కుట్ర చేస్తుంది

సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య 

పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు

సూర్యాపేట 20 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని దక్షిణాది రాష్ట్రాలను దెబ్బ తీసే డిలిమిటేషన్ బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు గుడిపాటి నర్సయ్య గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు  అన్నారు. కాంగ్రెస్, మిత్రపక్షాలపై బురద చల్లేందుకు బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు వీగిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనడాన్ని ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. బిజెపి ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డిలిమిటేషన్ బిల్లు డ్రామా ఆడారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి చేయడంలో బిజెపి ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. 2023 లోనే పెట్టిన మహిళా బిల్లు ప్రస్తుతం పాస్ కాదని తెలిసి కాంగ్రెస్ ను బధనం చేసేందుకు బిజెపి కుట్రలు పన్నుతుందన్నారు. బిజెపి ఎన్నికలప్పుడే డ్రామా ఆడుతుందని అందులో భాగమే మహిళా బిల్లు అన్నారు.

మహిళలపై ప్రేమ ఉంటే 248 పార్లమెంటు స్థానాల్లో 31 మంది మహిళలకు, 106  రాజ్యసభ స్థానాల్లో 18 మంది మహిళలకు మాత్రమే అవకాశం ఎందుకు ఇచ్చారని అన్నారు. మహిళ బిల్లు ఒక్కటే ప్రవేశపెడితే కాంగ్రెస్ మిత్రపక్షాలు తప్పకుండా మద్దతు ఇస్తుందన్నారు. మహిళా బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణం బిజెపి పార్టీ అని బిజెపి అంటేనే మనువాద, మహిళలకు వ్యతిరేకమైన పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఓ పెద్ద దుర్మార్గాన్ని అడ్డుకున్నాయని బిజెపి కులం మతం పేరుతో అధికారంలోకి వచ్చింది తప్ప మహిళలకు చేసింది ఏమి లేదన్నారు.

మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీడే అన్నారు. విద్యా హక్కు చట్టం తీసుకురావడంతో పాటు భూ సంస్కరణలు తెచ్చి రాజాభరణ రద్దు చేసిన చరిత్ర కాంగ్రెస్ దే అన్నారు. ఒక మహిళ ప్రధానిగా ఇందిరాగాంధీ, లోక్సభ స్పీకర్ గా, మహిళ యూపీఏ చైర్మన్గా మహిళలను చేసిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు.

దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం బిజెపి చేసిందని మహిళా హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ అని బిజెపి దుష్ప్రచారని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. మహిళలపై బిజెపి పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి కేవలం మహిళ బిల్లును మాత్రమే ప్రవేశపెడితే కాంగ్రెస్ మిత్ర పక్షాలు కచ్చితంగా మద్దతు ఇస్తాయని అన్నారు. మహిళ బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమంటూ బిజెపి చేస్తున్న దుష్ప్రచారని ప్రజలు ప్రజాస్వామిక వాదులు  ఖండించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజద్ అలి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, ఛివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు దారావత్ వీరన్న నాయక్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, జిల్లా కాంగ్రెస్ వాణిజ్య సెల్ చైర్మన్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ నాగుల వాసు, జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెన్న మధుకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అన్నమయ్య రాము, సేవాదళ్ చీఫ్ ఆలేటి మాణిక్యం, మున్సిపల్ కౌన్సిలర్ చిలుముల సునీల్ రెడ్డి, వెక్కన్తి శేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గడ్డం వెంకన్న, చెంచల నిఖిల్, నరేందర్ నాయుడు, పెద్దమామ శ్రీరాములు, నాగు నాయక్, సాజిద్ నీడ్స్, యల్కపల్లి వెంకన్న, వెంకటయ్య, రవి నాయక్, కారింగుల రాజబాబు, వాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333