పుట్టగొడుగుల వెలుస్తున్న అక్రమ వెంచర్లు 

Apr 19, 2024 - 20:54
 0  78
పుట్టగొడుగుల వెలుస్తున్న అక్రమ వెంచర్లు 

అనుమతి లేని వెంచర్లలో హద్దురాళ్ళ తొలగింపు

తెలంగాణ వార్త కొండపాక:- కొండపాక ఏప్రిల్ 19 కొండపాక మండలం దుద్దెడ, వెలికట్ట శివారులోని అనుమతి లేకుండా అక్రమంగా పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న వెంచర్లలో హద్దు రాళ్ళను అధికారులు శుక్రవారం తొలగించారు. ఎం పీ ఓ వీర రాజు  ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది రాళ్లను తొలగించారు. అనుమతి లేకుండా వెంచర్లు చేయడం చట్ట వ్యతిరేకం ఎలాంటి అనుమతి లేకుండా ఉన్న అక్రమ వెంచర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయకూడదని వినియోగదారులకు సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333