అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ స్పందిస్తారా ? 

మున్సిపల్ అధికారులకు అధికారాలు ఎందుకు ?

Nov 21, 2024 - 17:38
 0  5
అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ స్పందిస్తారా ? 
అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ స్పందిస్తారా ? 
అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ స్పందిస్తారా ? 

ఫుట్ పాత్ లను ఆక్రమించి  జోరుగా వ్యాపారాలు

రెండుసార్లు నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్న మున్సిపల్ అధికారులు

కమిషనర్ ని అడుగుతే టిపిఓ.. టి పి ఓ వి అడుగుతే కమిషనర్

కాలయాపన చేస్తున్న మున్సిపల్ అధికారులు

మురుగు కాలువ కబ్జా చేసిన రెస్టారెంట్ నిర్మాణంపై కమిషనర్ ఎందుకు స్పందించరు ? 

మురుగు కాలువను ఆక్రమించి రెస్టారెంట్ నిర్మాణం 
పట్టించుకోని మున్సిపల్ అధికారులు 

ప్రారంభోత్సవం అయ్యేదాకా కాలయాపన చేసిన మున్సిపల్ అధికారులు

గత ఆరు నెలలుగా అక్రమ రెస్టారెంట్ నిర్మాణం పై పోరాటం

కొత్తగూడెం నవంబర్ 21( ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో సర్వేనెంబర్ 143లొ  27వ వార్డులో సెంట్ మేరీ స్కూల్ ఎదురు నేషనల్ హైవే రోడ్డు పక్కన మురుగు కాలువను ఆక్రమించి అక్రమ రెస్టారెంట్ నిర్మాణం చేపడుతున్న అధికారాలు ఉండి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మున్సిపల్ అధికారులు ఉన్నారు.. పూర్తి అయి ప్రారంభోత్సవం దగ్గర ఉండి జరిపించే వరకు సహాయ సహకారాలు అందించిన మున్సిపల్ అధికారులు..గత 6 నెలలుగా నిర్మాణం మొదలుకొని పలు పత్రికలలో ప్రచురిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు తప్ప వారు చేసే పని ఏమీ లేకుండా ఉన్నది. మున్సిపల్ కమిషనర్ ను అడుగుతే టి పి ఓని అడగండి అంటున్నారు టి పిఒ ని అడుగుతే మున్సిపల్ కమిషనర్ ని అడగండి అంటున్నారు తప్ప ఎవరు కూడా దీనికి స్పందించే పరిస్థితి కనిపించడం లేదు. అక్రమ నిర్మాణమని తెలిసినా సక్రమంగా అక్రమ నిర్మానుల దారులకు అండగా నిలుస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేది లేదని ఎవరైనా అక్రమంగా నిర్మాణం చేపడితే చర్యలు తీసుకుంటామని చెప్పే అధికారులు పేదవారికి ఒక న్యాయం డబ్బు ఉన్నవారికి  వారికి ఒక న్యాయం అన్న రీతిగా వ్యవహరిస్తున్నారు. ఉండడానికి ఇల్లు లేని నిరుపేదలు చిన్న గుడిసె వేసుకుంటేనే వెంటనే  సంఘటన స్థలానికి చేరుకొని కూల్చివేసే అధికారులు నేడు కొత్తగూడెం పట్టణంలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్న నిర్మాణదారులకు సహకరిస్తున్నారు తప్ప వాటిని ఆపే ప్రయత్నం చేయకపోవడం వెనుక ఏదో బలమైన రాజకీయ శక్తి ఉన్నదని అనుకుంటున్న ప్రజలు . తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తప్పులు చేసే వారిని ప్రోత్సహిస్తూ అక్రమాలకు తెర లేపుతున్నారు.జిల్లా అధికారులైన స్పందించి మురుగు కాలువలను ఆక్రమించి అక్రమంగా రెస్టారెంట్ నిర్మిస్తున్న వాటిని తొలగించి ప్రజల ఆరోగ్యాలని కాపాడవలసిన అవసరం ఉన్నదని పలువురు కోరుచున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయవలసిందిగా కోరుతున్న ప్రజలు. ఇంత జరుగుతున్న మాకు ఏమీ పట్టనట్టు మున్సిపల్ అధికారులు వ్యవహారం ఇస్తున్న తీరు విస్మయం కలిగిస్తుంది ప్రజా పాలన అంటే ఇదేనా అన్న రీతిగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తుండడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న మున్సిపల్ అధికారులపై తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్న ప్రజలు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333