బీహార్ యువకులను కంట్రోల్ చేయండి
మట్ట్వాడ పోలీసులకు వాహనదారుల విన్నపం
భద్రకాళి దేవాలయం ఆర్చ్ ఎదురుగా ఉన్న సెంట్రల్ జైలు పెట్రోల్ బంక్ లో ఉన్న పంచర్ షాప్ లో ఇద్దరు బీహార్ యువకులు పని చేస్తున్నారు..
వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వారి పంచర్ షాపు వద్ద వాహనాలకు గాలి పెట్టడం వారి పని.
వీరు చేసే పనిని సూపర్వైజ్ చేసే సిబ్బంది అనే వారు అక్కడ ఎవరూ లేరు...
పెట్రోల్ బంక్ లో పనిచేసే వారిని అడిగితే వారు మాకు సంబంధం లేదు అని అంటున్నారు..
ఈ బీహార్ యువకులు గంజా మత్తులో ఉండటం, వచ్చి పోయే వాహనదారుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, బీహార్ అని బెదిరిస్తూ, హిందీలో తిడుతున్నట్లు సమాచారం.
అంబర్ ప్యాకెట్లు జేబులో నుండి తీసి నోట్లో వేసుకోవడం, ఒక విధంగా చెప్పాలంటే మత్తులో పని చేస్తున్నారు..
రోడ్డుపై వెళ్తున్న పాలిటెక్నిక్ విద్యార్థినులను సైతం హిందీలో కామెంట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు..
ఎలాంటి అఘాయిత్యం జరగక ముందే వారిని కట్టడి చేసి, వారి మత్తు దింపాల్సిన బాధ్యత స్థానిక పోలీసులు తీసుకోవాలని కోరుతూ..
రాత్రి పూట వీరు ఎక్కడ ఉంటున్నారు? ఏమి చేస్తున్నారో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు..
వీరి పట్ల స్థానిక పోలీసులు వారి వివరాలు అడిగి వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలని, అలాగే వారు రాత్రి పూట అఘాయిత్యాలకు పాల్పడక ముందే వారిని కంట్రోల్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.