పార్లమెంట్ ఎన్నికల్లో బిజేపి నీ ఓడించాలి..

జె వెంకటేష్  CITU రాష్ట్ర కార్యదర్శి 

Apr 2, 2024 - 22:13
 0  115
పార్లమెంట్ ఎన్నికల్లో బిజేపి నీ ఓడించాలి..

రానున్న పార్ల మెంట్ ఎన్నికల్లో కేంద్రం లోని బిజేపి నీ అధికారంలోకి రాకుండా అడ్డుకొని కార్మికులు చైతన్య వంతం గా ఓటు హక్కు ను ఉపయోగించు కోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ కార్మిక వర్గాలకు పిలుపునిచ్చారు..

మంగళ వారం నాడు సీఐటీయూ జిల్లా కార్యాలయం లో జరిగిన సీఐటీయూ జిల్లా అఫీస్ బెరర్స్ సమావేశం లో ఆయన పాల్గోని ప్రసంగించారు..

ఈ సందర్భంగా 2014 లో కేంద్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు... గుజరాత్ మిత్రులైన అధాని అంబానీ లకు కారు చౌకగా అమ్మేషరన్నారు.. ఆయిల్, గ్యాస్,పెట్రోలియం, రైల్వే, బొగ్గు గనులు,విమానయానం లాంటి ప్రభుత్వ సంస్ధలను ప్రయివేట్ సంస్థలకు అప్ప జెప్పీ చేతులు దులుపు కున్నారని అయన వాపోయారు...

రాజ్యాంగ సంస్థలను ద్వసం చేస్తూ, మత ప్రాతిపదికన చీల్చి మత ఘర్షణలను పెంచుతుందని జే వెంకటేష్ అన్నారు...

మూడవ సారి అధికారంలోకి రావడానికి రామ మందిరం నిర్మాణం పేరుతో హిందూ మతము ప్రచారం చేసి ఓట్లు దండు కోవడానికి ప్రయత్నం మోడీ చేస్తున్నాడని ఆయన అన్నారు... బీజీపీ 370 సీట్లు గెలుస్తామని మైండ్ గేమ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు... వాస్తవానికి బిజేపి కి ఉత్తర  భారత్ లో తన పట్టు కొల్పోతుందని ఈ పరిస్టి తుల్లోనే అక్షింతలు ఇంటింటికి పంచి సెంటు మెంటు తెచ్చారని
అందుకే రానున్న ఎన్నికల్లో బిజేపి నీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటే తప్ప దేశ ప్రజలకు రక్షణ లేదన్నారు...

రాష్ట్రం లో అధికారము లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అయన కోరారు.. గ్రామ పంచాయతీ, అంగను వాడి టీచర్స్, అషా, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని వెంకటేష్ కొరారు..

ఈ సమావేశం లో కామ్రెడ్ అధ్యక్షత వహించగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు , చెఱకు యాక లక్ష్మీ, యలక సోమన్న పాల్గోన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333