తాడి చెట్టు పై నుండి పడి గీత కార్మికునికి గాయాలు

Nov 20, 2024 - 19:51
Nov 20, 2024 - 20:22
 0  6
తాడి చెట్టు పై నుండి పడి గీత కార్మికునికి గాయాలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్:- తాడి చెట్టు పై నుండి పడి గీత కార్మికునికి గాయాలు ఆత్మకూరు ఎస్ మండలం లోని మాక్తా కొత్త గూడెం గ్రామానికి చెందిన చామకూరి పెద్ద ఉప్పలయ్య రోజు మాదిరి తాడి చెట్టు ఎక్కుతుండగా బుదవారం సాయింత్రం ప్రమాద వశాత్తూ మోకు జారి తాడి చెట్టు పై నుండి కింద పడి తీవ్ర గాయాల పాలైనాడు. అతనినీ సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అతనికి 10 లక్షల ఎక్స్ గ్రెషియా చెల్లించాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మడ్డి అంజి బాబు కొత్త గూడెం సొసైటీ అధ్యక్షులు కాసాని సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.