రైతులకు ఎల్ నీనో అవగాహన సదస్సు
అడ్డగూడూరు 24 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం,చిన్నపడిశాల నందు రైతులకి ఎల్ నినో గురించి వివరించడం జరిగింది.వాతావరణ పరిస్థితులు వర్షా భావ పరిస్థిస్తులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలనీ తెలపడం జరిగింది.ఈప్పుడు ఉన్న వర్షాల దృష్ట్యా వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన కందులు,పెసర, పొద్దుతిరుగుడు,నువ్వులు,ఆ ముదం వంటి పంటలు సాగు చేస్తే బెట్ట పరిస్థితులని తట్టుకుని మంచి దిగుబడులు వస్తాయి.అదే విదంగా కూరగాయాలు సాగు వైపు మొగ్గు చూపాలని తెలపడం జరిగింది.వరి పంటకి బదులు ఆయిల్ పామ్ వంటి పంటకి రైతులు మార్పు చూపాలని తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్ధానిక వ్యవసాయ అధికారి పాండురంగాచారి,తహసీల్దార్ శేషగిరిరావు జానకిపురం సర్పంచ్ ననుబోతు అనిత సమ్మయ్య ఉపసర్పంచ్ జి రాజు,కార్యదర్శిలు సురేష్ , శ్రీశైలం,జిపిఓ సురేష్ ఆయా గ్రామా రైతులు తదితరులు పాల్గొన్నారు.