భారత సైన్యానికి మద్దతుగా కొవ్వొత్తులతో ర్యాలీ తీసిన యువకులు

May 7, 2025 - 20:59
 0  11
భారత సైన్యానికి మద్దతుగా  కొవ్వొత్తులతో ర్యాలీ తీసిన యువకులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ భారత సైన్యానికి మద్దతు - ఆత్మకూర్ ఎస్ లో గ్రామస్తుల కొవ్వొత్తుల ర్యాలీ పహల్గాం లో ఉగ్రవాదుల దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధురు పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లో వైమానిక దాడులు చేసి ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి మద్దతుగా దేశవ్యాప్తంగా మద్దతు ఆత్మకూర్ మండల కేంద్రంలో గ్రామస్తులు, యువకులు భారత సైన్యానికి మద్దతుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జై జవాన్ భారత్ మాతాకీ జై అంటూ నినదించారు. జాతీయ జెండాలు చేతబట్టి కొవ్వొత్తులతో గ్రామంలో ర్యాలీ తీశారు. ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదుల భారత్ జోలికి వస్తే ఈ ఆధునిక భారతం చూస్తూ ఊరుకోదు అంటూ సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పందిరి మాధవరెడ్డి డేగల శ్రీనివాస్ గుండ కృష్ణమూర్తి జలగం మల్లయ్య గుండ్ల లింగయ్య గిలకత్తుల ప్రవీణ్ బైరెడ్డి పోతన్ రెడ్డి పగిడి ఎల్లయ్య దాసరి పరమేష్ గుణగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.