డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణలో భాగంగా నిర్వహిస్తున్న అవగాహన""సీఐ చరమంద రాజుహుజూర్నగర్ పిఎస్

తెలంగాణ వార్త ప్రతినిధి హుజూర్నగర్ : హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించిన సీఐ చరమంద రాజు.
డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణలో భాగంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల ను ఉద్దేశించి సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలన విద్యార్థుల పాత్ర అనే అంశంపై జూనియర్ కళాశాల విద్యార్థులకు వ్యాసరచన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. డ్రగ్స్ వినియోగించే వారి జీవితం నాశనం అవుతుందని వారు భవిష్యత్తు కోల్పోతారని చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదవాలని సిఐ తెలిపారు.