ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. 8.30కు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10-11 గంటలకు ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది