పదవి విరమణ పొందిన ASI నీ   ఘనంగా సన్మానించిన----------- జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్

May 31, 2025 - 19:46
 0  23
పదవి విరమణ పొందిన ASI నీ   ఘనంగా సన్మానించిన----------- జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్

జోగులాంబ గద్వాల 31 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. పదవి విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు పోలీస్ శాఖ ఎప్పటికీ మరవదు అని, వారి శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో ఆనందంగా గడపాలని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ అన్నారు. జిల్లా లో సుమరు 37 సంవత్సరాలుగా వివిధ హోదాలలో పనిచేసి ఈ రోజు పదవి విరమణ పొందిన కోదండపూర్ ASI శ్రీ SK.సైఫుద్దీన్ సోఫీ నీ   జిల్లా ఎస్పీ గారు తన ఛాంబర్ లో ఘనంగా సన్మానించారు. 


ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా సర్వీస్ ను పూర్తి చేసుకుని పదవీ విరమణ చేయడం ఏంతో అభినందనీయం ఆని,  ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారని అన్నారు. పోలీస్ విభాగంలో సుధీర్ఘకాంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన సిబ్బంది  సేవలను మరువమని “ పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు” అని కొనియాడారు. విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా, పిల్లలకు దూరంగా ఉండి విధులు నిర్వహించినారని, వారు  ప్రజలకు అందించిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని అన్నారు,  పదవి విరమణ చేసిన పోలీసులు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఓ సతీష్ కుమార్, ఆలంపూర్ సీఐ రవి బాబు మరియు ఏ.ఎస్సై కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333