పదవ తరగతి ఫలితాల్లో రాహుల్ విజ్ఞాన్ ప్రభంజనం

చర్ల ఏప్రిల్ 30
చర్ల మండల కేంద్రములో ఉన్న రాహుల్ విజ్ఞాన్ విద్యార్ధి, విద్యార్థినిలు ప్రభంజనం సృష్టించారు. బుధవారం
ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. హాజరైన విద్యార్థులు 59 మంది, ఉత్తీర్ణులైన విద్యార్థులు 59 మంది కాగా మండలంలో అత్యధిక మార్కులు సాధించిన పాఠశాలగా రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం నిలిచింది.
మా విద్యార్థిని బిట్రగుంట లాస్యలహరి 564 మార్కులు సాధించి మండలంలో ప్రధమ స్థానం, గోగినేని వెస్లీ 545 పొంది పాఠశాల ద్వితీయ స్థానం, జవ్వాది స్నేహ శ్రీ 543 తృతీయ స్థానం సాధించారు. 500కు పైగా మార్కులు 25 మంది సాధించారు.. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు,
తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ డి ఎన్ కుమార్, డాక్టర్ ప్రతిభ,
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీ వీ పీ సీ శాస్త్రి, కొసరాజు హరిచరణ్, ప్రిన్సిపల్ వర్మ రాజులకు అభినందనలు తెలియజేశారు.