పత్రికా విలేకరిని పరామర్శించిన నాజా జాతీయ అధ్యక్షుడు

May 28, 2024 - 21:20
May 29, 2024 - 20:09
 0  123
పత్రికా విలేకరిని పరామర్శించిన నాజా జాతీయ అధ్యక్షుడు

28-05-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:-  చిన్నంబావి మండలం గూడెం గ్రామానికి చెందిన పత్రికా విలేకరిని పరామర్శించిన నాజా జాతీయాధ్యక్షుడు డా. మురహరి బుధ్ధారం మండల పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన తెలుగు సత్తా విలేకరి నాగరాజు ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకొని నాజా (నాన్ అక్రెడిటేషన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మురహరి బుద్ధారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. జర్నలిస్టుల అభ్యున్నతికి పాటుపడే నాజా ఆధ్వర్యంలో సాటి విలేకరి నాగరాజు కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా నాజా ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఇలాంటి సందర్భాలలో విలేకరి మిత్రులందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వీరితోపాటు ఐ ఎన్ టి యూ సి సభ్యులు సుదర్శన్, సాయిబాబా, లక్మన్, చిన్నంబావి మండల నాజా అధ్యక్షుడు సేవకుల రవి, నాజా సభ్యులు ఆర్. మణి నాయుడు, విష్ణుకుమార్ సాగర్ తదితర విలేకరులు ఉన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State