నేటి నుండి సంపూర్ణ మద్యపాన నిషేధం గ్రామంగా వెలసిన గట్టికల్లు.

Oct 14, 2024 - 16:40
Oct 14, 2024 - 16:44
 0  4
నేటి నుండి సంపూర్ణ మద్యపాన నిషేధం గ్రామంగా వెలసిన గట్టికల్లు.

నాలుగు దశాబ్దాలు గా సమస్యాత్మక గ్రామంగా అధికారుల రికార్డుల లో నమోదైన గట్టికల్లు గ్రామం,*ఐక్యతకు, శాంతికి మారుపేరు అని నిరూపిస్తూ..సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా సోమవారం వెలసింది. అన్ని రాజకీయ పార్టీలు యువజన సంఘాలు మహిళా సంఘాల ఆద్వర్యం లో గాంధీ జయంతి సందర్బంగా ఈనెల 2న ప్రారంభించిన మద్యపాన నిషేధ అమలు కోసం ఏకమయ్యారు.ం మద్యం మహమ్మారితో ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయని ఊరంతా ఒక్కటై  ఉద్యమించిన గట్టికల్లు గ్రామo 12రోజుల్లో అధికారుల సహకారం తో నేటి నుండి సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా రూపు దిద్దుకుంది.గ్రామం లో మద్యం అమ్మినా తాగినా 25000/- రూపాయల జరిమానా మద్యo అమ్మకాలు జాడ చెప్పిన వారికి 2500/- బహుమానం అని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ ఉద్యమానికి సహకారం అందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం గారికి, సూర్యాపేట ఎక్సైజ్ సిబ్బంది గారికి, ఆత్మకూర్ ఎస్ మండల పోలీస్ సిబ్బందికి, గ్రామపంచాయతీ కార్యదర్శి కి, గ్రామపంచాయతీ సిబ్బంది మీడియా మిత్రులకు  గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ ఉద్యమానికి ఎలాంటి వివాదాలు లేకుండా స్వతహాగా మద్యం అమ్మకాలు బంద్ చేసిన బెల్ట్ షాపుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఐకమత్యంగా మద్య నిషేధం అమలు చేయడం పట్ల గ్రామస్తులకు అభినందనలు.
భూపతి రాములు 
జర్నలిస్టు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333