నెలలు గడిచిన డబ్బులు ఏవి....? రైతు ఆవేదన
రెండు నెలలు గడిచిన ధాన్యం డబ్బులు రాలే రైతు చిలుకల ఆంజనేయులు ఆవేదన.
నెల రోజులు కాంటా అయిన డబ్బులు రాలే ఇక మేము ఏమి చేయాల సారు.
తుంగతుర్తి 17 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్ :- తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామ రైతు చిలుకల ఆంజనేయులు నా సొంత పొలంలో 300 బస్తాలకు పైచిలుకు వడ్లను మా గ్రామంలో సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోసినాము. వాటిని కాంటా పెట్టడానికి నెల రోజులకు పైగా నిర్వాహకులు కాంట్ వేయడంలో అశ్రద్ధచేసి రెండు నెలలు గడుస్తున్నాయి. మేము ధాన్యం తెచ్చి ఇక్కడ కాంటాలు కావడానికి నెల దాటింది ఎన్నోసార్లు మొరపెట్టుకొని గత 20 రోజుల క్రితం కాంటావేశారు మొత్తం మేము రైతు సొసైటీలో 2 నెలలు కావస్తుంది. మేము కాంటా పెట్టి నెల దాటింది. ఇంతవరకు మా డబ్బులు మా అకౌంట్లో రాలేదు. ఇది ఏమిటని అడగగా ఆ సొసైటీ నిర్వాహకుడు మేము మిల్లుల వద్ద నుండి ట్రిప్ సీట్లు ఆన్లైన్ రైతుల బస్తాలు వారికి వచ్చే డబ్బుల లెక్కలు కొట్టి నా తర్వాత రైతుల బస్తా లెక్కను కొడుతున్నాము. ఇంకా కొన్ని రోజులలో వస్తాయి అని మాకు బొంకడం జరుగుతుంది. ఇంకా మేము కాలం నెత్తి మీదకి వచ్చిన నార్లు పోసుకున్న మాకు డబ్బులు వేయరా మేము ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రేటు 400 పెచ్చు ఉందని పోసి నానా ఇబ్బందులు పడుతూ ధాన్యం రాశులు పోయడానికి పట్టాలు మా సొంత0 తెచ్చుకుంటే అవి చెదలు పట్టి చీకిపోయినాయి. మరోపక్క హమాలీలు కాంటా వేసినాడు మా అమాలీలు మామూలు ఇవ్వాలని డబ్బులు వసూలు చేస్తూ ధాన్యాన్ని అడుక్కున్నారు .ఇంత జరిగిన ప్రభుత్వ అధికారులు మండల అధికారులు చీమకుట్టినట్టు కూడా లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇంకా కొంతమంది రైతుల ధాన్యాల నుండి మిల్లు వద్ద కటింగ్ పెట్టారని ఒక్కొక్క లారీకి 6: క్వింటాలనుండి 10: క్వింటాలవరకు కటింగ్లు చేసినారు. అయినా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి మా మండలంలో మహిళా సంఘాల ద్వారా కాంటాలు వేసిన వారం రోజులకే డబ్బులు మా అకౌంట్లోకి వచ్చాయని ఈరోజు మాత్రం మహిళా సంఘాలు వద్దు మా సొసైటీ ద్వారా మంచిగా రైతులకు న్యాయం చేస్తానని ప్రగల్బాలు పలికి ఈరోజు మాకు మొండిచేయి చూపించారు. సొసైటీ పెద్దలు ఇంకా మేము ఎన్ని రోజులు ఆగాలి మా బాధలు తెలుసుకోరా మరోపక్క వర్షాలు కాలం దగ్గర పడ్డది నార్లు పోసుకుంటున్నారు. మేము డబ్బులు ఎక్కడ తెచ్చుకోవాలి సారు అని రైతులు లబోదిబోమంటున్నారు. అయినప్పటికీ చెవిన పెట్టని రైతు సొసైటీ అని చెప్పవచ్చు.
గత పది సంవత్సరాల నుండి మా గ్రామంలో మహిళా సంఘాల ద్వారా రోజు వచ్చిన రాశులను రాసుకొని క్రమంగా కాంటాలు వేస్తూ ఎలాంటి తగాదాలు ఇబ్బందులు లేకుండా చేసిన మహిళా సంఘాలను గ్రామంలో కొంతమంది పెద్దల ద్వారా మండలంలో మహిళా సమైక్య ఉన్నప్పటికీ మహిళా సంఘాల ద్వారా ధాన్యాల కోణాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తే ఈరోజు కొంతమంది బడా నాయకుల పెత్తనంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆగం చేశారని మండలంలోని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము రెండు నెలలు ఆగినప్పటికీ మా కష్టాలు చూడని నాయకులు ఇంకా ఏమి మొఖం పెట్టుకొని ఎన్నికలలో వస్తారో చూస్తాం మాకు సమయం వస్తుంది అని వారు ఆవేశంగా బాధలను చెప్పుకుంటున్న రైతులు. ఇప్పటికైనా తక్షణమే మా అకౌంట్లోకి డబ్బులు తొందరగా వచ్చేటట్లు జిల్లా అధికారులు స్పందించాలని లేనియెడల రాస్తారోకోళ్ల ధర్నాలు తప్పని హెచ్చరించారు.