నీటి సమస్య తీర్చండి సారు!

చర్ల 17-03-2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆరో కొత్తగూడెం గ్రామంలో గత మూడు రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని తాగునీటి కోసం ఆర్ కొత్తగూడెంలో గ్రామపంచాతీ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామానికి నీరందించే నాయకులు గానీ అధికారులు గానీ సమస్యను పట్టించుకునే నాధుడు గాని ఫలితం లేకపోవడంతోమిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చారు మండుటెండల్లో ఖాళీ బిందెలతో కుళాయిల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నామని వాపోతున్నారు. ఇకనైనా తక్షణమే అధికారులు స్పందించగలరు అని కోరుతున్నా రు