ఘనంగా రాజీవ్ గాంధీ గారి 80 వ  జయంతి వేడుకలు

Aug 20, 2024 - 19:04
 0  6
ఘనంగా రాజీవ్ గాంధీ గారి 80 వ  జయంతి వేడుకలు

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి నివాళ్లు అర్పించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ గారు...

ఈరోజు ములుగు జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం డి చంద్ పాషా గారి ఆధ్వర్యంలో భారత రత్న దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ గారు విచ్చేసి కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ....

ఐరన్ లేడీ అఫ్ ఇండియా దివంగత ప్రధాన మంత్రి స్వర్గీయ ఇందిరమ్మ గారి మూడవ కుమారుడు రాజీవ్ గాంధీ గారు 1984 అక్టోబర్ 31 న తల్లి మరణం తో ఉత్తర ప్రదేశ్ నుండి  అమేది లోక్ సభ పార్లమెంట్ నియోజకవర్గం నుండి 1981 లో పోటీ చేసి ఎన్నిక అయ్యారు  తల్లి మరణం తో కాంగ్రెస్ పార్టీ తన భుజస్కంధాలపై  వేసుకొని 1984 లో దేశ భవిష్యత్తు కోసం  40 సంవత్సరాల వయసులోనే భారతదేశ ప్రధానమంత్రిగా  అతిపిన్న వయసుకుడు  చరిత్రలోకి ఎక్కారు, తదుపరి ఎన్నికలలో అత్యధిక స్థానాలలో అత్యధిక మెజారిటీ మెజారిటీని సాధించి  రెండవసారి ప్రధానమంత్రి అయ్యారు ,రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వo లో ఆధునీకరణ, ఉదారికరణ పై దృష్టి సారించింది  మొదటిసారిగా కంప్యూటర్లు,టెలి కమ్యూనికేషన్ వంటి రంగాలలో ఆయన అనేక ముఖ్యమైన సంస్కరణ ప్రవేశపెట్టాడు  రాజీవ్ గాంధీ గారిని భారత దేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు, దేశంలో కంప్యూటరైజేషన్ , టెలి కమ్యూనికేషన్  విప్లవం యొక్క ఆయనకే చెందుతుందని, స్థానిక స్వపరిపాలన సంస్థల్లో  మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు  కృషి చేసిన ఘనత ఆయనకే చెందుతుందని, ఓటు హక్కును  21 సంవత్సరాల నుండి  18 సంవత్సరాల కు  తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కల్పించారు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతనలో  ఎన్నో చేసిన ఘనత ఆయనకే చెందుతుందని , 1991 లో మే 21న రాజీవ్ గాంధీ గారు తమిళనాడులో శ్రీ పేరంబుదుంబూరు లో ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేస్తున్న సందర్భంలో బాంబు దాడిలో  స్వర్గస్తులైనారు  దేశం కోసం ప్రణాలచ్చిన కుటుంబ ఒక్క గాంధీ గారి కుటుంబం మాత్రమే అని రాజీవ్ గారికి ఘనంగా నివాళ్లు తెలిపారు ఈ కార్యక్రమం లో..
కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి,జడ్పీటీసీ నామకారం చంద్ గాంధీ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లు నల్లెల భారత్, బండి శ్రీను వారితో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మండల్ నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు......

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333