పేదల కష్టంలో ఆపద్బాంధవుడిగా తన వంతు సహాయం అందిస్తున్న జల్లారపు శ్రీనివాస్

చర్ల, జూలై 10 : చర్ల మండల పరిధిలోని పూజారిగూడెం గ్రామానికి చెందిన పూజారి కిరణ్ -స్వరూప దంపతుల రెండవ సంతానం దీపక్ చందు, బాబు వయసు ముప్పై నెలలు, ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి లివర్ ఇన్ఫెక్షన్ కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఖమ్మం పట్టణంలోని అంకుర హాస్పిటల్ లో ఐసియూ లో ఎడ్మిట్ చేయడం జరిగింది. తండ్రి కిరణ్ వెల్డింగ్ పని, తల్లి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న వారి స్తొమతకు మించి అప్పు చేసిమరీ లక్షా యాభై వేల రూపాయలు ఖర్చు చేసి గత నాలుగు రోజులుగా వైద్యం అందిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న కత్తిగూడెం గ్రామంలోని కిసాన్ పురుగు మందుల షాప్ యజమాని జల్లారపు శ్రీనివాస్ తనకు తెలిసిన డీలర్స్, డిస్టిబ్యూటర్స్, స్నేహితులు, రైతులు ఇలా సుమారు అరవై మంది దాతల సహకారంతో ఇరవై ఒక్క వేల రూపాయలు (21000/-)జమచేసి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. జల్లారపు శ్రీనివాస్ గతంలోనూ కష్టాల్లో ఉన్న పేదలకు సహాయం చేసేవారని తను చేసేది చిన్న వ్యాపారం ఐనా పేదల కష్టాల్లో తనవంతు సహాయం చేయడంలో ముందుంటారని, పేదింట్లో పుట్టి పెరిగి, పెద్ద చదువులు చదువుకొని ప్రతీ పేదింటి ఆపదలో అండగా నిలుస్తున్న జల్లారపు శ్రీనివాస్ ను పలువురు ప్రముఖులు, మండల ప్రజలు ప్రశంసిస్తున్నారు.