గొర్రెలు మేకల కాపరులు పట్టణంలో ఇండ్ల మధ్య మేతకు వెళితే బహుపరాక్.
పందులకోసం ఇంటియజమానులు పెట్టిన విషపు ఆహారంతో మీ గొర్రెల ప్రాణాలకే ముప్పుఈరోజు సాలార్జంగ్ పేట కి చెందిన జలీల్ తన గొర్రెలు మేకల మందను బైపాస్ దగ్గరలోని నివాసాల మధ్య మేపుతుండగా ఇంటి యజమానులు తమ ఇళ్లమధ్య తవ్వుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న పందుల నివారణకు గుళికలు కలిపిన అన్నం తిన్న ఒక గొర్రెపోతు రెండు మేకలు తొలుత పాము కరిచిందని బ్రహ్మించిన కాపరులు హుటాహుటిన స్థానిక ప్రాంతీయ పశువైద్యశాలకు తరలించగా లక్షణాలను బట్టి అది పాము కాటు కాదని ఫుడ్ పాయిజనింగ్ అని వెంటనే చికిత్స నిర్వహించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య ప్రాణాలతో పోరాడుతున్న జీవాలను విషం విరుగుడు ఇస్తూ మధ్యాహ్నం వరకు వైద్యశాలలోనే ఉంచి చికిత్స నిర్వహించి జీవాలకు ప్రాణదానం చేయడం జరిగింది
పట్టణ మరియు పరిసర ప్రాంతాల జీవాల పోషకులు పట్టణంలోకి మేతకి వచ్చినప్పుడు ఇండ్ల పరిసరాల్లో జీవాలు మేతకు వెళ్లకుండా చూసుకోవాలని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లక్షల విలువ చేసే మందలు ఇలా ఫుడ్ పాయిజనింగ్ నకు గురయ్యే ప్రమాదం ఉందని సూచించారు
అలాగే పందులు , ఎలుకలు పందికొక్కుల నివారణకు గృహయజమానులు ఏమైనా మందులు పెట్టినట్లైతే అవి రాత్రిపూట పడుకునే ముందు పెట్టుకుని ఉదయం లేవగానే వాటి అవశేషాలు లేకుండా తొలగించి సురక్షితంగా భూమిలోనికి పాతిపెట్టి నోరులేని జీవాల ప్రాణాలను రక్షించాలని అసిస్టెంట్ డైరెక్టర్ సూచించారు
జీవాల చికిత్స లో సిబ్బంది డా వినయ్ , రాజు ప్రశాంత్ చంద్రకళ సాగర్ తదితరులు పాల్గొన్నారు