అమరుల త్యాగాలతోనే తెలంగాణ ఏర్పాటు

Jun 2, 2025 - 16:08
 0  3
అమరుల త్యాగాలతోనే తెలంగాణ ఏర్పాటు

 మలిదశ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. 

 తెలంగాణలో  మరింత అభివృద్ధి జరగాలి. 

తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్  అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

 (సూర్యాపేట టౌన్/ జూన్ 2 ) 

 సీమాంధ్ర పెట్టుబడిదారుల కబంధ హస్తాల నుండి  తెలంగాణ విముక్తి కోసం అమరుల రక్తతర్పణ, ప్రజల పోరాటాల ఫలితంగానే  ఏర్పాటు  జరిగిందని తెలంగాణ జై గౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారులు, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1969 ఉద్యమం మొదలుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగేంత వరకు ఎంతోమంది ఉద్యమకారులు అమరులయ్యారని గుర్తు చేశారు. 1969 లో సుమారు 400 మంది విద్యార్థులు అమరులు అయ్యారని గుర్తు చేశారు. 1996- 97 సంవత్సరంలో మలిదశ తెలంగాణ ఉద్యమం లో బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసి పోరాటం చేసిన బెల్లి లలితక్క, మారోజు వీరన్న వంటి వారు ఎంతోమంది తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను కోల్పోయారని వారి త్యాగం వృధా కాదన్నారు. 2001 నుండి కేసీఆర్ సారథ్యంలో టిఆర్ఎస్ పార్టీతో పాటు వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు,ఉద్యమ సంఘాలు, విద్యార్థులు జేఏసీగా పోరాటం చేసి తెలంగాణ సాధించారని కొనియాడారు. వలసవాదుల పాలన నుండి విముక్తి కాబడిన తెలంగాణను ప్రభుత్వాలు మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పంతంగి వీరస్వామి గౌడ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత 33 జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన సౌకర్యం మెరుగుపడిందని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి నీళ్లు, అభివృద్ధికి నిధులు,నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులు వారి జీవితాలు దుర్భరమైన పరిస్థితులు గడుపుతున్నారని వారు ఎంతో మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. మలిదశ పోరాటంలో ఉద్యమించిన ఉద్యమకారులకు ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలం కేటాయించడంతోపాటు పింఛన్ సౌకర్యం కల్పించడంతోపాటు రాజకీయ రంగంలో అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట.... రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మం పాటి అంజయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్, బొమ్మగాని వెంకన్న గౌడ్, ఆము, సారగండ్ల కోటేష్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333