నలుగురు ముఠా గా కలిసి బాధితులను కత్తులతో బెదిరించి
నలుగురు ముఠా గా కలిసి బాధితులను కత్తులతో బెదిరించి ఒకే రోజు రెండు చోట్ల రాబరీ చేసిన కేసులలో A1 నిందితుడికి ఒక సంవత్సరం 5 నెలల 6 రోజుల జైలు శిక్ష మరియు 200/ రూపాయాల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించిన ఆలంపూర్ JFCM కోర్టు జడ్జీ కవిత
కేసును ఛేదించి, నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీస్ అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ రితిరాజ్,
జోగులాంబ గద్వాల 9 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- నలుగురు ముఠా గా కలసి ఒకే రోజు రెండు వేరు పోలీస్ స్టేషన్ ల పరిధిలో బాధితులను కత్తులతో బెదిరించి వెండి ,బంగారం ఆభరణాలు మరియు నగదు దొంగలించిన కేసులో గతం లో A2,A3 కు. శిక్షలు పడగ A1 నేరం ఒప్పుకున్నందున రెండు కేసులలో A1 కు ఒక సంవత్సరం 5 నెలల 6 రోజుల జైలు శిక్ష మరియు 200/- రూపాయాల జరిమానా విధిస్తూ ఆలంపూర్ JFCM కోర్టు జడ్జి కె. కవిత . నిన్న సాయంత్రం తీర్పును వెల్లడించారు.
కేసుల వివరాలు
మనోపాడ్ స్టేజి లోని శ్రీ చక్ర కోల్డ్ స్టోరేజ్ నందు తేది 25.03.2018 నాడు రాత్రి నలుగురి తో వచ్చిన ముఠా స్టోరేజ్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్న శంకర్ రెడ్డి కుటుంబాన్ని కత్తులతో బెదిరించి అతడి భార్య మెడలోని పుస్తేల గొలుసు, చైన్, కమ్మలు, కూతురు మెడలోని బంగారు గోలుసు, చెవి కమ్మలు దొంగలించుకపొగ పిర్యాదు శంకర్ రెడ్డి s/o కొండారెడ్డి ,R/o కులుమాల, కర్నూల్ జిల్లా వారి పిర్యాదు మేరకు మనోపాడ్ పోలీస్ స్టేషన్ లో క్రైం నం 52/2018 u/s 392,342, 452 ipc గా కేసు నమోదు అయినది.
అదే రోజు రాత్రి ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో ఆలంపూర్ X రోడ్డు వద్ద ప్రకాశం జిల్లా కు చెందిన 7 మంది తాపీ మేస్త్రీ కూలీలు విశ్వశాంతి జూనియర్ కళాశాల. నుతన బిల్డింగ్ నిర్మాణమునకు వచ్చి ప్రక్కనే ఒక ఇంట్లో అద్దె కు ఉండగా అదే ముఠా అక్కడకు వచ్చి కత్తులతో బెదిరించి చేతులు కట్టేసి ఒక అమ్మాయి కాళ్ళ పట్టీలు, 42000/- రూపాయాల నగదు ,మరియు మొబైల్ తిసుకొని వెళ్ళగా పిర్యాది చిన్న వీరయ్య s/o పోలయ్య, తిమ్మన పాలెం గ్రామం, కుర్చపాడు మండలం ప్రకాశం జిల్లా కు చెందిన పిర్యాదు మేరకు ఉండవల్లి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నం 65/2018 u/s 392,342,452 IPC క్రింద కేసు నమోదు అయినది.
ఈ రెండు కేసులలో అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అప్పటి సి. ఐ లు శ్రీ జె.వేంకటేశ్వర్లు, రజిత, ఎస్సై లు పర్వతాలు- మనోపాడ్, చంద్రమోహన్ - ఉండవల్లి లు విచారణ చేపట్టారు. అందులో భాగంగా CC కెమేరాలు , ఇతర సాంకేతిక ఆధారాలతో మనోపాడ్ ఎస్సై పర్వతాలు నిందితులు వచ్చిన కారును, నెం ప్లేట్ ను గుర్తించి వారు మహారాష్ట్ర కు చెందిన వారిగా నిర్ధారించుకొని తన సిబ్బంది తో మహారాష్ట్ర వెళ్లి 10 రోజుల పాటు నాందేడ్ చుట్టు ప్రాంతంలో నిఘా ఉంచి నలుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి రిమాండ్ కు తరలించడం జరిగింది.తదుపరి విచారణ పూర్తి చేసి ఆలంపూర్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది.
తరవాత ఈ కేసులలో A-2(బీమా నర్సింగ్ వాగ్మోర్ @బీమా @రాజ, వయసు -30, వడ్డెర కాలని, నాందేడ్ జిల్లా మహారాష్ట్ర), A-3( దాండ్ల బాబు @బాబు బాలాజీ గైక్వాడ్, వయసు -35, మాణిక్ బండార్ శివార్, మక్లూరు మండలము, నిజామాబాద్ జిల్లా(స్వస్థలం - కాన్పూర్ పేట, డేగ్లూర్ తాలూకా, నాందేడ్ జిల్లా,మహారాష్ట్ర.) లు కోర్టు వాయిదాలకు హాజరు అవుతున్న క్రమం లో నేరం రుజువు కాగా వారికి 23.12.2019 నాడు రెండు కేసులలో 4 నెలలు జైలు శిక్ష మరియు 100/- రూపాయాల జరిమాన విధిస్తూ ఆలంపూర్ JFCM మేజిస్ట్రేట్ తీర్పును వెల్లడించారు.
A-1(మెత్కర్ లకన్ పిరాజీ @ లక్ష్మణ్, వయసు -35, R/o నందుషా గ్రామం, అర్దాపూర్ తాలూకా, నాందేడ్ జిల్లా,మహారాష్ట్ర.),A -4 లు వాయిదాలకు హాజరు కాకపోవడం తో NBW వారెంట్ ఇష్యూ కాగా అప్పటి మనోపాడ్ ఎస్సై సంతోష్ 3 రోజుల పాటు మహరాష్ట్ర లో ఉండి NBW వారెంట్ జారీ చేసి జైలు లో A 1పై PT వారెంట్ ఇష్యూ చేసి ఆలంపూర్ కోర్టు లో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపగా నేడు నేరం ఓప్పుకున్నందున ఆలంపూర్ JFCM కోర్టు మేజిస్ట్రేట్ శ్రీమతి కె. కవిత ఒక సంవత్సరం 5 నెలల 6 రోజుల జైలు శిక్ష మరియు 200/- రూపాయాల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
ఈ కేసులో నేరస్థులకు జైలు శిక్ష పడడానికి కృషి చేసిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్తీక్ రాజు , అప్పటి ఎస్సై లు పర్వతాలు, సంతోష్ ,చంద్ర మోహన్, అప్పటి సి.ఐ లు జె .వేంకటేశ్వర్లు, రజిత ఇప్పటి ఎస్సై లు శ్రీనివాస్, చంద్రకాంత్ లు, కోర్టు కానిస్టేబుల్స్ గిరి, శ్రీనివాస్ ల ను జిల్లా ఎస్పీ రితిరాజ్,IPS అభినందించారు .