విత్తనాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలి

- లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జోగులాంబ గద్వాల్ జిల్లా
కుర్వపల్లి, గద్వాల రైతుల కొరకు ఉద్దేశించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ బి శ్రీనివాసులు మరియు లక్ష్మణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయం మరియు రైతుల చట్టాలను, సీడ్ చట్టాలను రైతులకు వివరించారు. రైతులు విత్తనాలు ఏ సమయంలో కచ్చితంగా రసీదును అడిగి తీసుకోవాల్సిందిగా కోరారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు నాణ్యమైన విత్తనాలను ఎరువులను మందులను కొనుగోలు చేయాలని చెప్పారు. పట్టణంలో నకిలీ విత్తనాల విషయంలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. రైతులకు ఏమైనా చట్టపరమైన సమస్యలు ఎదురైనప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 151 00 కు గాని, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 08546-272677 కు ఫిర్యాదు చేయగలరని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీమతి. గాయత్రి గౌడ్ మరియు లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ బి శ్రీనివాసులు మరియు లక్ష్మణస్వామి పాల్గొన్నారు.
...............................................................
జారీ చేయువారు డిపిఆర్ఓ/జోగులాంబ గద్వాల జిల్లా.