ఉచిత వైద్య శిబిరం

తిరుమలగిరి 10 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా అరుణాచలం ప్రదేశ్ నుండి వచ్చిన ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సిబ్బందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిరుమలగిరి డాక్టర్ మల్లెల వందన ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.కొంత మందికి వాతావరణ మార్పుల కారణంగా చిరు వ్యాధులను గుర్తించి చికిత్స నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో CHO మాలోతు బిచ్చునాయక్, నర్సింహా రెడ్డి, పొన్నం విజయ్ కుమార్ పాల్గొన్నారు.