నగదు పట్టివేత
తిరుమలగిరి 24 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల వద్ద ఎన్నికల కోడ్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద అనుమతులు లేకుండా అక్రమంగా నగదును తరలిస్తూ పట్టుబడ్డ తొండ గ్రామానికి చెందిన బాష్పాల సోమ నరసయ్య తండ్రి చిన్న మల్లయ్య, వద్ద 50,200/రూపాయలు టీఎస్ 29 టి బి 4618 వాహనం నుండి అట్టి నగదును సీజ్ చేసినట్లు తిరుమలగిరి ఎస్సై సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎవరైనా 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదును తరలించినట్లయితే సీజ్ చేస్తామని ఆయన తెలిపారు ఈ తనిఖీలలో తిరుమలగిరి ఎస్సై సత్యనారాయణ గౌడ్ మరియు సిబ్బంది తదితరులు ఉన్నారు