ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.
ధాన్యం సేకరణలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు. గురువారం కలెక్టర్ అన్నపురెడ్డిపల్లి మండల పరిధి గుంపెన, నామవరంలలో పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి కోతలు చాలా చోట్ల పూర్తయ్యాయని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు కొనుగోలు కేంద్రాలలో తగిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 128 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసి ప్రారంభించామని తెలిపారు. ప్రతి కేంద్రంలో గన్ని బ్యాగులు, తేమ పరీక్ష పరికరం, తూర్పారబట్టిన యంత్రం, టార్పాలిన్ లు అందుబాటులో ఉంచామని చెప్పారు. రైతులు ఎఫ్ఏక్యూ ప్రకారం తేమశాతం, తాల్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేసి పరిశీలించి, తేమ శాతం ఎంత ఉందని తనిఖీ చేశారు.ఏ మిల్లుకు ట్యాగ్ చేసింది ఆ మిల్లుకు పంపాలని, ఏ రోజు సేకరించిన ధాన్యం అదే రోజు రవాణ అయ్యేలా చూడాలన్నారు. కౌలు రైతుల జాబితా తయారు చేసి ముందస్తుగా టోకెన్లు ఇవ్వాలని, ధాన్యం డబ్బుల చెల్లింపులో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త తీసుకోవలన్నారు. కేంద్రాల వద్ద ఉన్న రైతులతో కలెక్టర్ దిగుబడి ఎలా ఉంది, కేంద్రాల్లో ధాన్యం అమ్ముతున్నారా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలుకు నాణ్యత ప్రమాణాల మేరకు ధాన్యం తీసుకొచ్చేలా రైతులను ప్రోత్సాహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు
అనంతరం కలెక్టర్ నామవరం గ్రామంలో నీటి సరఫరా స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామాల్లో పర్యటించి స్థానికులను నీటి సరఫరా తీరు ను అడిగి తెలుసుకుంటూ ప్రతిరోజు ఎంతసేపు నీరు సరఫరా అవుతుంది? నీటి సరఫరా తీరును అధికారులు పర్యవేక్షిస్తున్నారా? అని క్షేత్ర స్థాయి స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో ఎన్ని నల్లా కనెక్షన్ లు ఉన్నాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకు న్నారు నీటి సరఫరా తీరు ను స్థానికులను అడిగి తెలుసుకొని నీటి వృధా ను అరికట్టాలని, అవసరాల మేరకు నీటిని వినియోగించుకోవా లని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలంలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున గ్రామాలలోని నీటి నిలువలను వృధా చేయకుండా సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లాలో ఎలాంటి త్రాగునీటి సమస్య లేదని అయినప్పటికీ ప్రజలు త్రాగు నీటని వృధా చేయరాదని నిత్యవసర అవసరాలకు ముడి నీరును ఉపయోగించుకోవాలని కోరారు గ్రామాలలో ఉన్నటువంటి బోర్ వెల్స్ పనితీరును గ్రామాల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రస్తుతం ఉన్న నీటి వనరులను ఉపయోగించుకుంటూ, గ్రామాల్లో మరమ్మత్తులలో ఉన్న చేతి పంపులు, బోర్లు , మంచినీటి బావులు, తదితర వాటర్ సప్లై వనరులను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టరు వేణుగోపాల్, వ్యవసాయ అధికారి బాబురావు, డిఎం సివిల్ సప్లై అధికారి త్రీనాథ్ బాబు, తాసిల్దార్ జగదీశ్వర ప్రసాద్, ఎంపీడీవో మహాలక్ష్మి, అశ్వారావుపేట ఇంచార్జి ఏ డి ఏ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, గ్రామపంచాయతీ సెక్రటరీలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.