ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Oct 23, 2024 - 20:42
Oct 24, 2024 - 11:53
 0  5
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  మంగళ తండా FPO, నాబార్డ్ వారి సహకారంతో కందగట్లలో స్వీట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీవో వేణు మాధవరావు పాల్గొని మాట్లాడుతూ రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలని సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ హరిచంద్ర ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి దివ్య, ఆర్ఐ ప్రదీప్ రావు, నాబార్డ్ DDM సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, FPO సీఈఓ వెంకన్న, FPO చైర్మన్ శంకర్ నాయక్, డైరెక్టర్లు ముస్కు మోహన్ రెడ్డి, గోగుల సత్తిరెడ్డి, జలంధర్ రెడ్డి, వీర సోములు, బొల్లం కృష్ణయ్య, హేమ, బాలాజీ, మంగ్యా, గ్రామ రైతులు పాల్గొన్నారు.