కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి సందర్భంగా
చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఏపూర్ ఎర్ర సూర్యుడు కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ఎం సిపిఐ యు రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఆత్మకూరు ఎస్ ఏపూర్ ఎర్ర సూర్యుడు ఎం సిపిఐ యు వ్యవస్థాపకులు కామ్రేడ్ మద్ధికాయల ఓంకార్ అని ఎం సిపిఐ యు రాష్ట్ర కార్యదర్శి గాధగోని రవి అన్నారు. ఓంకార్ 16 వర్థంతి సందర్భంగా ఆయన స్వస్థలం ఐన ఏపూర్ గ్రామాన్ని ఎం సిపిఐ యు రాష్ట్ర కమిటి ఆద్వర్యంలో సందర్శించి ఓంకార్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1924 సంవత్సరంలో ఏపూర్ గ్రామం లో జన్మించిన ఓంకార్ చిన్న వయసులోనూ దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఆంధ్ర మహాసభ పిలుపులో భాగంగా ఈ ప్రాంతంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి, మద్ది కాయల ఓంకార్, మల్లు స్వరాజ్యం, రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. 1951లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ అనంతరం ఎర్రజెండా నీడలో పేద ప్రజలకు కోసం తన జీవితం అంతా త్యాగం చేశారని నర్సంపేట నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజల అణగారిన వర్గాల కోసం తన గళం విప్పి అసెంబ్లీలో పేదల కోసం కొట్లాడారని ఆయన అన్నారు. అసెంబ్లీ టైగర్ గా బిరుదు పొంది పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారని అన్నారు. శత్రువుల దాడిలో అనేకసార్లు హత్య ప్రయత్నాలు జరిగిన తప్పించుకొని మృత్యుంజయుడిగా చివరి వరకు జీవించాడని 2008 అక్టోబర్ 16 న తుది శ్వాస విడిచారనీ అన్నారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వస్తే తప్ప విముక్తి లేదు అని బహుజన రాజ్యాధికారం కోసం మార్క్సిజం - అంబేద్కర్ ఆలోచన విధానం జమిలిగా ఏక కాలంలో అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఎం సిపిఐ యు కేంద్ర కమిటీ సభ్యులు వస్కుల మట్టయ్య ,వరికుప్పల వెంకన్న , సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఎస్కే. నజీర్ ,సహాయ కార్యదర్శి సోమన్న , ఎం సిపిఐ యు రాష్ట్ర కమిటి సభ్యులు పోతుగంటి కాశి నాయకులు కిరణ్ ,హరీష్ పాల్గోన్నారు..