ధరూర్ సందర్శించిన ఉడిపి పేజవర్ పీఠాధిపతి.
జోగులాంబ గద్వాల 14 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ధరూర్. ఉడిపి పెజవార్ పీఠాధిపతి శ్రీ విశ్వప్రియ తీర్థ స్వామీజీ శుక్రవారం ధరూర్ మండల కేంద్రములోని శ్రీ చింతరేవుల ఆంజనేయస్వామి దేవాలయ అర్చకులు ఆద్య కేశవాచారి గృహం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేశారు. అనంతరం కేశవాచారి యోగ క్షేమాలు తెలుసుకొని ఆయనను స్వామీజీ సన్మానించి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఆద్య కిష్టా చారి మధ్వాచారి, బాబురావు, నాగరాజు శర్మ, చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.