ధరణి సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం

Jul 26, 2024 - 21:03
 0  3
ధరణి సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం

???? ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన

???? ధరణి సమస్యలపై శాశ్వత పరిష్కారం కోసం అవసరమైతే సమగ్రమైన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ధరణిలో సవరణలు చేస్తున్న సందర్భంగా కొత్తగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

???? ధరణి సమస్యలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. సవరణలు చేసే క్రమంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

???? సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని, అవసరమైతే ఈ విషయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని, దీనిపై అసెంబ్లీలోనూ చర్చించి అందరి సూచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా సమగ్రమైన చట్టం రూపొందించాలని ఆదేశించారు.

???? రెవెన్యూ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి,  ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, మాజీ మంత్రి  కుందూరు జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు  ఎం. కోదండరెడ్డి,  రేమండ్ పీటర్,  ఎం.సునీల్ కుమార్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333