దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
జోగులాంబ గద్వాల 27 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల:- జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు జములమ్మ పరశురాముడు స్వామి దేవాలయంలో జమదగ్ని సమేత జమ్ములమ్మ అమ్మ వారి కళ్యాణోత్సవము సందర్భంగా మంగళవారం స్థానిక ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలు సమర్పించాచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నడిగడ్డ ఇలవేల్పు అయిన జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం లో 4వ వార్షికోత్సవంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది అని అయన అన్నారు. జములమ్మ అమ్మవారి దర్శించుకోవడానికి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తమ మొక్కలను తీర్చుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం జనవరి నుండి జూన్ వరకు ఈ జములమ్మ అమ్మవారిని దర్శించుకుని విచ్చేస్తుంటారు.
వారికి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ భవిష్యత్తులో జములమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రంగా ఏర్పడే విధంగా కృషి చేస్తామని తెలిపారు.జాతరకు, కళ్యాణోత్సవము వచ్చే భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం, నడిగడ్డ ప్రాంతంలో రైతులకు సకాలంలో వర్షాలు పండాలి. రైతుల పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావాలి, రైతు అభివృద్ధి చెందాలి, వ్యాపార వ్యవహార, విద్యా వైద్య రంగాలలో కూడా సి.ఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్ పర్సన్ గాయత్రి సతీష్, మాజీ ఎంపీపీ విజయ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, సత్య రెడ్డి, జి. వేణుగోపాల, ఆలయం కమిటీ డైరెక్టర్స్ అభిలాష్, ఓం ప్రకాష్, నాయకులు గోవిందు, భగీరథ వంశీ ధర్మ నాయుడు, శంకర్, వీరేష్, మౌలాలి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.